Begin typing your search above and press return to search.

మినీ సంగ్రామం 2026: ఐదు రాష్ట్రాల ఫలితాల లైవ్ అప్‌డేట్స్!

By:  Tupaki Desk   |   4 May 2026 9:10 AM IST

ఐదు రాష్ట్రాల్లో ఫలితాల ఉత్కంఠ!

ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏ రాష్ట్రంలో గెలుపెవరిది? ఎక్కడ ఒటమి ఎవరిది? ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ప్రతి తాజా అప్‌డేట్ Tupaki.com మీకు అందిస్తోంది.


Live Updates

  • 4 May 2026 10:06 AM IST

    తమిళనాట టీవీకే విజయ్ ప్రభంజనం

    టీవీకే విజయ్ : 102+ ఆధిక్యం

    అన్నాడీఎంకే : 69+ ఆధిక్యం

    డీఎంకే :57 ఆధిక్యం

  • 4 May 2026 9:59 AM IST

    మమతా బెనర్జీని వదలని సువేందు అధికారి

    బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ. భవానీపూర్ నియోజకవర్గంలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఆధిక్యం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ నేత సువేందు అధికారి కఠిన పోటీ ఇవ్వడమేనని రాజకీయ విశ్లేషకులు ముందున్నారు.

    ఒకప్పుడు మమతా బెనర్జీకి ఆప్తుడిగా ఉన్న సువేందు అధికారి, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమెకు షాక్ ఇచ్చి గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఓటమితో సీఎం పదవి కొనసాగాలంటే భవానీపూర్ ఉపఎన్నికల్లో మమత తప్పనిసరిగా గెలవాల్సి వచ్చింది.

    ప్రస్తుతం భవానీపుర్‌లోనూ అదే తరహా పోటీ కనిపిస్తుండగా, సువేందు అధికారి మళ్లీ 2021 సన్నివేశాన్ని పునరావృతం చేస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పోటీ బెంగాల్ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.

  • 4 May 2026 9:51 AM IST

    బెంగాల్ లో దూసుకుపోతున్న బీజేపీ.. మమతకు భంగపాటు

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 155 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి.. మెజార్టీ మార్క్‌ను దాటేసింది.

    అధికార పార్టీ అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ 107 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 4, లెఫ్ట్ పార్టీలు 3 స్థానాల్లో అధికారంలో ఉన్నాయి.

    ఈ పరిణామాలతో కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయం వద్ద నిశ్శబ్ద వాతావరణం. కార్యకర్తల సందడి కనిపించకపోవడం. మరోవైపు న్యూఢిల్లీలో బీజేపీ శిబిరంలో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి.

  • 4 May 2026 9:47 AM IST

    తమిళనాడులో విజయ్ కింగ్ నా? కింగ్ మేకరా?

    అధికార డీఎంకే ఆధిక్యం : 50+ స్థానాలు

    ప్రతిపక్ష అన్నాడీఎంకే : 69+

    టీవీకే విజయ్ :97 స్థానాల్లో ఆధిక్యం

    దీన్ని బట్టి టీవీకే విజయ్ కింగ్ అయ్యి సీఎం అవుతారా? కింగ్ మేకర్ గా నిలుస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.

  • 4 May 2026 9:45 AM IST

    యానాంలో మల్లాడి కృష్ణారావు ఆధిక్యం

    యానాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్ ఫలితం వెలువడింది. మొదటి రౌండ్‌లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఆధిక్యంలో నిలిచారు. ఆయనకు 4,413 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోష్‌కు 3,917 ఓట్లు వచ్చాయి. దీంతో మల్లాడి కృష్ణారావు 496 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తం ఐదు రౌండ్లలో భాగంగా ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది.

  • 4 May 2026 9:36 AM IST

    పుదుచ్చేరిలో బీజేపీ 22+ స్థానాలతో బీజేపీదే అధికారం

    మొత్తం 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో బీజేపీ 22 స్తానాలతో అధికారం సుసాధ్యం చేసుకుంది. కాంగ్రెస్ 6 స్థానాలతో అధిక్యంలో ఉన్నారు. ఇతరులు 1 స్థానాల్లో ఉన్నారు.


  • 4 May 2026 9:35 AM IST

    అస్సాంలో మళ్లీ బీజేపీనే

    అస్సాలో వరుసగా బీజేపీనే గెలుస్తోంది. ఈసారి కూడా బీజేపీ 78 స్థానాలతో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 28+ స్థానాలతో వెనుకబడింది. ఏఐ యూడీఎఫ్ 1, ఇతరులు 2 స్థానాలతో ఉన్నారు.


  • 4 May 2026 9:34 AM IST

    కేరళలో యూడీఎఫ్ లీడ్.. ప్రభుత్వం మారడం ఖాయం

    కేరళలో సంప్రదాయం కొనసాగుతోంది. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవడం లేదు. సీపీఎం విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ 44 స్థానాలతో వెనుకబడగా.. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ 90 స్థానాలతో అధికార దిశగా సాగుతోంది.

    *బీజేపీ 6 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 0 స్థానాల్లో ఉన్నారు.


  • 4 May 2026 9:34 AM IST

    పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 123, టీఎంసీ 119

    ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత టీఎంసీ లీడ్ లో ఉండగా.. తర్వాత బీజేపీ పుంజుకుంది.

    మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీ 119 స్థానాలతో లీడ్ లో ఉండగా.. బీజేపీ 123 స్థానాలతో మెజార్టీలో ఉంది. కాంగ్రెస్ 2, ఇతరులు 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే బెంగాల్ లో మమతాను ఓడించి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయం.

  • 4 May 2026 9:33 AM IST

    తమిళనాట టీవీకే విజయ్ లీడ్

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా మారాయి. అధికార డీఎంకే పార్టీ 52 స్థానాలతో వెనుకబడగా.. టీవీకే విజయ్ పార్టీ 79 స్థానాలతో లీడ్ లో ఉంది. అన్నాడీఎంకే 53 స్థానాలతో రెండో స్థానం కోసం పోటీపడుతోంది.

    విజయ్, బీజేపీ కలిస్తే తమిళనాట అధికారం ఖాయంగా కనిపిస్తోంది.