Begin typing your search above and press return to search.

మినీ సంగ్రామం 2026: ఐదు రాష్ట్రాల ఫలితాల లైవ్ అప్‌డేట్స్!

By:  Tupaki Desk   |   4 May 2026 9:10 AM IST

ఐదు రాష్ట్రాల్లో ఫలితాల ఉత్కంఠ!

ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏ రాష్ట్రంలో గెలుపెవరిది? ఎక్కడ ఒటమి ఎవరిది? ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ప్రతి తాజా అప్‌డేట్ Tupaki.com మీకు అందిస్తోంది.


Live Updates

  • 4 May 2026 12:16 PM IST

    యానాం అసెంబ్లీ ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు విజయం

    యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోశ్‌పై 4,568 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. మొత్తం 35,840 ఓట్లు నమోదైన ఈ ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావుకు 19,863 ఓట్లు లభించగా, అశోశ్‌కు 15,295 ఓట్లు వచ్చాయి.

  • 4 May 2026 12:11 PM IST

    బెంగాల్‌లో భాజపాదే ప్రభుత్వం: సువేందు అధికారి

    పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. 180కి పైగా సీట్లు గెలుచుకుంటామని ఆయన పేర్కొన్నారు. నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సువేందు అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు.

  • 4 May 2026 12:10 PM IST

    ఎగ్జిట్‌పోల్స్‌ను తలకిందులు చేసిన టీవీకే

    తమిళనాడులో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలన ఆధిక్యం సాధిస్తోంది. ముందుగా వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను పూర్తిగా తారుమారు చేస్తూ, ఆధిక్యాల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఇక డీఎంకే కూటమి మాత్రం అనూహ్యంగా మూడో స్థానానికి పరిమితమవుతోంది.

  • 4 May 2026 11:17 AM IST

    వెనుకంజలో ముగ్గురు సీఎంలు..

    తాజా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులు వెనుకంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్‌లో, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కొళత్తూరులో, కేరళ సీఎం పినరయి విజయన్‌ ధర్మదంలో వెనుకబడి కొనసాగుతున్నారు.

  • 4 May 2026 11:12 AM IST

    వెనుకంజలో స్టాలిన్‌, ఉదయనిధి

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే పరిస్థితి దెబ్బతింది. పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. సీఎం స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ కూడా తమ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం డీఎంకే కేవలం సుమారు 40 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 4 May 2026 11:01 AM IST

    పుదుచ్చేరిలో ఎన్.రంగస్వామి విజయం

    పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రంగస్వామి ఘన విజయం సాధించారు. తట్టంచావడి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన, మంగళం స్థానంలో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 4 May 2026 11:01 AM IST

    టీవీకే సెంచరీ దాటేసింది..

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే దూసుకెళ్తోంది. విజయ్‌ నేతృత్వంలోని పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సంఖ్య 118గా ఉంది.

  • 4 May 2026 10:56 AM IST

    అస్సాం బీజేపీదే (126 సీట్లు)

    బీజేపీ : 95+ సీట్లు

    కాంగ్రెస్ : 29

    ఏఐ యూడీఎఫ్ : 2

    ఇతరులు : 0 సీట్లు

  • 4 May 2026 10:55 AM IST

    కేరళలో అధికారం దిశగా యూడీఎఫ్

    యూడీఎఫ్ : 101

    అధికార ఎల్డీఎఫ్ : 38

    బీజేపీ : 1

    ఇతరులు : 0

  • 4 May 2026 10:54 AM IST

    పశ్చిమ బెంగాల్ లో 293 అసెంబ్లీ సీట్లు

    బీజేపీ : 172 సీట్లతో అధికారం దిశగా సాగుతోంది..

    టీఎంసీ : 113 సీట్లతో 2వ స్థానంలో ఉంది.

    కాంగ్రెస్ : 2

    లెఫ్ట్ : 1

    ఇతరులు : 5 సీట్లు