Begin typing your search above and press return to search.

476 పార్టీల రద్దు.. ఈసీ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా..?

ఈసీ నిబంధనలకు లోబడి లేని పార్టీలను రద్దు చేస్తుంది. ఇది దేశంలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   12 Aug 2025 12:09 PM IST
476 పార్టీల రద్దు.. ఈసీ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా..?
X

ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ఒక గన్యా దేశ పర్యటనలో భారత్ గురించి అద్భుతమైన విషయాలు వెల్లడించారు. భిన్నత్వంలో ఏకత్వం, పదుల సంఖ్యలో భాషలు, వందలాది పార్టీలు ఇలా చాలా చెప్పారు. ఆ సమయంలో ఆ దేశ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక దేశం ఇలా కూడా ఉంటుందా..? అని భరత్ అంటే ప్రపంచానికి జ్ఞానం నేర్పిన గురువు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి. కేంద్రంలో కూడా కొన్ని ఉన్నాయి. కానీ అవి ప్రధానంగా రెండు పార్టీలకు అనుగుణంగా పని చేస్తాయి.

ప్రతీ పార్టీ విలువైనదే..

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. కాబట్టి ప్రతి పార్టీ ఇక్కడ విలువైనదే. ప్రతి పార్టీకి అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల నిర్వహన ఫలితాలు వెల్లడించే వరకు ప్రతీ అంశాన్ని స్వయం ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్ (ఈసీ) చూసుకుటుంది. స్వాతంత్రానికి ముందు ఒకటి రెండు పార్టీలు ఉన్నా.. ఆ తర్వాత రాష్ట్రాల్లో పార్టీల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. ఈసీ నిబంధనలకు లోబడి లేని పార్టీలను రద్దు చేస్తుంది. ఇది దేశంలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది.

మరో 476 పార్టీల గుర్తింపు రద్దు..

ఈ నెల(ఆగస్ట్) లోనే దేశ వ్యాప్తంగా 334 రాజకీయ పార్టీలను రద్దు చేసిన ఈసీ తాజా మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి 476 పార్టీలను రద్దు చేసినట్లు ప్రకటించి పార్టీలకు షాక్ ఇచ్చింది. అయితే ఇవన్నీ ఎన్నికల నిబంధనలకు లోబడి లేవని తెలిపింది. ఇటీవల బిహార్ ఓట్ల జాబితా నుంచి 65 లక్షలకు పైగా ఓట్లను తొలగించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ జాబితాను ఆగస్ట్ 1వ తేదీ రిలీజ్ చేసిన ఈసీ.. తుది జాబితాను సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

నిబంధనల మేరకే తొలగింపు..

కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిన పార్టీల్లో ఏపీ నుంచి 17, తెలంగాణ నుంచి 9 ఉన్నాయి. 2019లో ఎన్నికల సంఘం ఆయా పార్టీలకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఒక్క ఎన్నికలో అయినా పోటీ చేసి నియమితంగా ఓట్లను రాబట్టుకోవాలని సూచించింది. ఈ నిబంధన పరిధిలోకి రాని పార్టీలను ఈసీ తొలగించింది.