Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త సర్వే : ఆ పార్టీదే గెలుపు అంటూ...!

ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం చూస్తే కనుక ఏపీలో రెండవ సారి వైసీపీ ప్రభుత్వం కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చింది.

By:  Tupaki Desk   |   15 April 2024 5:24 PM GMT
ఏపీలో  కొత్త సర్వే :  ఆ పార్టీదే గెలుపు అంటూ...!
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగుతోంది. అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక కొత్త సర్వే వచ్చింది. ఈ సర్వేలో పేర్కొన్న ప్రకారం చూస్తే ఏపీలో కచ్చితంగా గెలిచేది వైసీపీ అని అంటున్నారు.

ఈ సర్వేని చేసింది న్యూస్ ఎరీనా ఇండియా అన్న సంస్థ. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం చూస్తే కనుక ఏపీలో రెండవ సారి వైసీపీ ప్రభుత్వం కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చింది. ఈ సర్వేను మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 దాకా చేశారు. అదే విధంగా చూస్తే 86వేల 200 శాంపిల్స్ ని తీసుకుని సర్వే చేసినట్లుగా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ సర్వే ప్రకారం ఏపీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ఏకంగా 50.38 శాతం ఓట్ల షేర్ తో వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తోందని తేల్చింది. అదే విధంగా వైసీపీకి 127 దాకా అసెంబ్లీ సీట్లు దక్కుతాయని లెక్క వేసి చెప్పింది.

అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 45.58 శాతం ఓట్ల షేర్ తో 48 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక కాంగ్రెస్ కి 1.38 ఓట్ల షేర్ దక్కుతుందని సీట్లు జీరో వస్తాయని తేల్చింది. ఇతరులకు 2.66 ఓట్ల షేర్ తో జీరో సీట్లు వస్తాయని పేర్కొంది.

ఈ సర్వే ప్రకారం చూస్తే కనుక యాభై శాతం కంటే ఎక్కువగా వైసీపీకి ఓట్లు అలాగే మంచి నంబర్ తో సీట్లు దక్కుతాయని తేల్చింది. ఈ సర్వేలో చూస్తే మహిళలు వైసీపీకి 52.44 శాతం మంది జై కొడుతున్నారు. అలాగే మగవారు 48.32 అనుకూలంగా ఉన్నారు. అదే టీడీపీ కూటమికి తీసుకుంటే మహిళల మద్దతు 44.53 శాతంగా ఉంటే పురుషులు 46.53 శాతంగా మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ కి మహిళల మద్దతు 0.94 శాతం మద్దతు ఉంది. పురుషుల్లో 1.83 శాతంగా ఉంది. ఇతరులకు మహిళలలో రెండు శాతం, పురుషులలో 3.22 శాతంగా ఉంది.

ఇక జిల్లాల వారీగా చూస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నది ఈ సర్వే తేల్చింది. శ్రీకాకుళంలో వైసీపీకి 8 సీట్లు కూటమికి 2 సీట్లు దక్కుతాయని పేర్కొంది. విజయనగరంలో వైసీపీకి 8 సీట్లు కూటమికి ఒక సీటు, విశాఖలో వైసీపీకి 4, కూటమికి 8, హోరాహోరీ పోరులో మూడు సీట్లు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో చూసుకుంటే వైసీపీకి తొమ్మిది, కూటమికి తొమ్మిది ఒక సీటు హోరాహోరీగా ఉంది. పశ్చిమ గోదావారి జిల్లా తీసుకుంటే వైసీపీకి ఎనిమిది కూటమికి ఏడు వస్తాయని తేల్చింది.

క్రిష్ణా జిల్లాలో వైసీపీకి పది కూటమికి అయిదు, హోరా హోరీ ఒక సీటుగా ఉంది. గుంటూరు జిల్లాలో చూస్తే వైసీపీకి తొమ్మిది కూటమికి రెండు హోరా హోరీ పోరులో ఆరు సీట్లు ఉన్నాయని తేల్చింది. ఇక ప్రకాశం జిల్లాలో చూస్తే వైసీపీకి తొమ్మిది కూటమికి రెండు హోరాహోరీ పోరులో ఒక సీటు ఉంది. నెల్లూరు తీసుకుంటే వైసీపీకి తొమ్మిది హొరాహోరీ పోరులో ఒక సీటు ఉంది. చిత్తూరు జిల్లాలో చూస్తే వైసీపీకి 12, కూటమికి ఒకటి, హోరా హోరె పోరులో ఒకటి ఉంది.

కడపలో వైసీపీకి పది సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చింది. అలాగే కర్నూల్ లో చూసుకుంటే వైసీపీకి 13 హోరాహోరీ పోరులో ఒక సీటు అని పేర్కొంది. అనంతపురంలో వైసీపీకి 12, టీడీపీకి ఒక సీటు, హోరా హోరీ పోరులో ఒక సీటు అని సర్వే తేల్చింది. మొత్తంగా చూస్తే వైసీపీకి 121 సీట్లు టీడీపీ కూటమికి 38 సీట్లు కచ్చితంగా దక్కుతాయని హోరా హోరీ పోరులో 16 సీట్లు ఉన్నాయని పేర్కొంది.