Begin typing your search above and press return to search.

ఎల్ నినో ముప్పు...నేరుగా ఇంటికీ ఒంటికీ !

ఎల్ నివో అన్నది టెక్నికల్ వర్డ్ గా భావించి చాలా మంది దాని వల్ల ఏమి జరుగుతుంది అనుకోవచ్చు.

By:  Satya P   |   14 April 2026 8:24 AM IST
ఎల్ నినో ముప్పు...నేరుగా ఇంటికీ ఒంటికీ !
X

ఎల్ నివో అన్నది టెక్నికల్ వర్డ్ గా భావించి చాలా మంది దాని వల్ల ఏమి జరుగుతుంది అనుకోవచ్చు. కానీ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఎల్ నినో అందులో భాగం అయిన ప్రతీ కుటుంబాన్ని వారి ఇంటినీ ఒంటినీ తీవ్రంగా ప్రభావం చేస్తుందని గుర్తించకపోతే ఇబ్బందులే అని అంటున్నారు మేధావులు. ఎల్ నినో ప్రమాదం ప్రకృతికి అయినపుడు అందులో మనిషికి కూడా ఉంటుందని అంటున్నారు.

అధిక వేడితో అవస్థలు :

ఎల్ నినో వల్ల సాధారణ వేడి కాస్తా అధికం అవుతుంది. దీంతో ఉన్న ఉదుటన ఉష్ణోగ్రతలు నాలుగైదు రెట్లు పెరుగుతాయి. ఎటు చూసినా హీటెడ్ కండిషన్ ఉంటుంది దాంతో అది మనిషి పాణాలను చాలా సైలెంట్ గా హరించే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి వేడి వేరు ఎల్ నినో ప్రభావం తో సంభవించే వేడి వేరు అన్నది మొదటిగా ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆరోగ్య రంగ నిపుణులు సూచిస్తున్నారు

మే గండం గడవాలి :

ప్రతీ వేసవి కాలంలో మే నెల చాలా తీవ్రంగా ఎండలు ఉంటాయి. అపుడే రోళ్ళు బద్ధలు కొట్టే రోహిణీ కార్తెలు కూడా మొదలవుతాయి. అయితే ఇదంతా వేసవిలో జరిగే తంతు కాబట్టి ఎంతో కొంత తట్టుకోవచ్చు. కానీ ఎల్ నినో అలా కాదని హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో పెను మార్పులు వస్తాయని అంటున్నారు. దాంతో ఈసారి వేసవి తీవ్రంగా ఉండవచ్చు అని సూచిస్తున్నారు. పర్యవసానాలు కూడా ఇంకా దారుణంగా ఉంటాయని అంటున్నారు.

సముద్రంలో నీరు వేడెక్కి :

ఎల్ నినో ద్వారా సముద్రంలో నీరు ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. అలా పసిఫిక్ మహాసముద్రం లోని నీరు అసాధారణంగా ఉష్ణోగ్రతలతో పొగలు కక్కుతుంది. అది ఏకంగా . దాంతో ప్రపంచవ్యాప్తంగా గాలి ప్రవాహాన్ని మార్చేస్తుంది. ఇక మామూలు వేసవి అయితే వేసవిలో వర్షాలు కురుస్తాయి. కానీ ఈసారి అలా ఉండదు. ఎల్ నినో ప్రభావంతో వానలు బాగా లేట్ కావచ్చు, తక్కువ పడవచ్చు. అసలు కురిసే వీలు లేకపోవచ్చు. దీనికి కారణం మే నెలలో పడాల్సిన వానలను తెచ్చేది దక్షిణ పశ్చిమ మాన్సూన్ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అవి ఈసారి పడాల్సిన సమయంలో పడకపోతే ఎండలు మండించేస్తాయని అంటున్నారు.

అలెర్ట్ కావాల్సిందే :

ఈ భీకరమైన ఎండల నుంచి రక్షించుకునేందుకు ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిప్పులు చిమ్మే వేడిమి వల్ల ఆరోగ్యంగా ఉన్న వారు సైతం ఒక్కోసారి ప్రమాదంలో పడతారు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నరు. దాంతో ప్రతీ ఒక్కరూ కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా దాహం వేస్తేనే ఎవరైనా నీళ్ళు తాగుతారు. కానీ అంతవరకూ వేచి ఉండకుండా శరీరానికి తగిన మేరకు నీరు తాగాల్సిందే అని అంటున్నారు. ఒక విధంగా ఎల్ నినో ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ప్రతీ గంటకూ ఒకసరి నీరు తాగాలని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు నీరు ఎక్కువగా తాగాలని కోరుతున్నారు.

ఎంత పని ఉన్నా కూడా :

ఇక బయటకు వెళ్ళే పనులను ఉదయం పది లోపు సాయంత్రం నాలుగు తరువాత చేసుకోవాలి. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్తే అధిక ఎండలతో అనారోగ్యం సంభవిస్తుందని అంటున్నారు. నలుపు రంగు దుస్తులు ధరించరాదని, ఆ స్థానంలో తెలుగు లేదా లేత రంగు దుస్తులు ధరిస్తే ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది అని అంటున్నారు. ఇక ఎండ దెబ్బ లక్షణాలను తెలుసుకోవాలి. ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పి సంభవించినా తల తిరగడం స్టార్ట్ అయినా వాంతులు వంటి వాటితో పాటు చమట అన్నది రాకపోతే కనుక కచ్చితంగా జాగ్రత్త పడాలి. నీడలోకి సదరు వ్యక్తిని తీసుకుని వెళ్ళి తడి గుడ్డతో శరీరాన్ని తుడిచి ఆ వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు.