Begin typing your search above and press return to search.

ఈక్రాకర్స్.. ట్రిఫుల్ ఐటీ హైదరాబాద్ కుర్రాడి ఘనత

ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కు చెందిన విద్యార్థి ఒకరు ఈ అంశంపై ఫోకస్ చేసి.. ఈ-క్రాకర్స్ కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 4:07 AM GMT
ఈక్రాకర్స్.. ట్రిఫుల్ ఐటీ హైదరాబాద్ కుర్రాడి ఘనత
X

పండగను.. పర్వదినాన్ని.. గెలుపును సెలబ్రేట్ చేసుకోవటానికి క్రాకర్స్ వాడటం తెలిసిందే. విజయానికి గుర్తుగా కాల్చే ఈ టపాసులతో పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని జరుగుతుందన్న మాట తరచూ తెర మీదకు రావటం.. తమ సెంటిమెంట్లను నీరుకార్చేలా క్రాకర్స్ కాల్చే విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న ఆవేదన వ్యక్తం కావటం తెలిసిందే. ఇక.. దీపావళి సందర్భంగా ప్రతిసారి క్రాకర్స్ కాల్చే విషయంలో నడిచే లొల్లి అంతా ఇంతా కాదు. ఇలాంటి వేళ.. క్రాకర్స్ కారణంగా వెల్లువెత్తే కాలుష్యానికి చెక్ పెట్టేందుకు వీలుగా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కు చెందిన విద్యార్థి ఒకరు ఈ అంశంపై ఫోకస్ చేసి.. ఈ-క్రాకర్స్ కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు.

క్రాకర్స్ కాల్చేటప్పుడు ఉండే కిక్కు.. దాని హడావుడి ఏ మాత్రం మిస్ కాని రీతిలో ఉండే ఈ క్రాకర్స్ కాన్సెప్టు అందరిని ఆకర్షించేలా ఉంది. కాలుష్యం అన్నది లేకుండా టపాసుల్ని కాల్చామన్న ఫీల్ మిస్ కాని రీతిలో ఈ-క్రాకర్స్ ను రూపొందించటం విశేషం. ట్రిఫుల్ ఐటీ హైదరాబాద్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అఫ్తాబ్ హుస్సేన్ సారథ్యంలో పీహెచ్ డీ విద్యార్థి అద్వైత సక్సేనా ఈ-క్రాకర్స్ ను రూపొందించారు.

టపాసులు కాల్చినప్పుడు కాంతి.. వెలుగుతో పాటు భారీ శబ్దం వెలువడటం తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ-క్రాకర్స్ లో ఎల్ ఈడీ మాట్రిక్స్ లైట్లు.. స్పీకర్లు.. బ్యాటరీ సర్య్కూట్ ను 10 సెంటీమాటర్ల వైశాల్యం కలిగిన బాక్సులో అమర్చటం ద్వారా అసలుసిసలైన క్రాకర్స్ ను కాల్చిన అనుభూతిని కలిగేలా రూపొందించారు. ఈ-క్రాకర్స్ కారణంగా ఎలాంటి పొగ వెలువడదు. కాలుష్యం రాదు. లైటింగ్ తో పాబు శబ్దాలు రావటంతో క్రాకర్స్ కాల్చిన అనుభూతి చెందేలా వైర్ లెస్ పరికరాన్ని రూపొందించారు.

సాధారణంగా టపాసులు కాల్చినప్పుడు వెయ్యి నుంచి 5వేల లక్స్ వెలుగు.. 100 నుంచి 140 డెసిబెల్స్ శబ్దం వినిపిస్తుంది. ఈ-క్రాకర్స్ లోనూ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి.. రెగ్యులర్ టపాసుల్ని కాల్చినప్పుడు కలిగే ఫీల్ ఈ-క్రాకర్స్ కాల్చినప్పుడు మిస్ కాదని అంటున్నారు. పొగ రాకుండా కాలుష్యాన్ని వెదజల్లకుండా పర్యావరణహితంగా ఉండే ఈ క్రాకర్స్ రానున్న రోజుల్లో గేమ్ ఛేంజర్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూద్దాం.