Begin typing your search above and press return to search.

భోపాల్‌ లో ఎకోస్ రెస్టారెంట్... దీని ప్రత్యేకత తెలిస్తే అభినందిస్తారు!

భోపాల్‌ లో 'ఎకోస్' రెస్టారెంట్‌ భాషలేని కమ్యునికేషన్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   3 July 2025 1:00 PM IST
భోపాల్‌  లో ఎకోస్  రెస్టారెంట్... దీని ప్రత్యేకత తెలిస్తే అభినందిస్తారు!
X

భోపాల్‌ లో 'ఎకోస్' రెస్టారెంట్‌ భాషలేని కమ్యునికేషన్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ అంతా సైగలతోనే కమ్యునికేట్ చేసుకుంటారు. అందుకు కారణం... దీనిని చెవిటి, మూగ ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. ఈ కేఫ్ కమ్ రెస్టారెంట్‌ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ తమ వైకల్యాన్ని అధిగమించారు! దీంతో.. ఇది హాట్ టాపిక్ గా మారింది.


అవును... భోపాల్‌ లోని నెం.10 మార్కెట్‌ లో గల ‘ఎకోస్ రెస్టారెంట్‌’ లోకి అడుగుపెట్టగానే అక్కడ అంతా నిశబ్ధం ఆవరించి ఉంటుంది. రెగ్యులర్ రెస్టారెంట్స్ లో వినిపించే గోల పెద్దగా కనిపించదు! ఇక్కడ అంతా సైగలతోనే కమ్యునికేషన్ ఉంటుంది. అతిథులను పలకరించడం నుండి వారిని టేబుల్ వద్దకు తీసుకెళ్లడం వరకు, ఆర్డర్ తీసుకోవడం వరకూ అంతా సంజ్ఞలతోనే ఉంటుంది.


ఇక టేబుల్ వద్ద కూర్చున్న కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేయాలంటే.. లేదంటే, వారికి ఏమైనా కావాలంటే.. ఆ టెబుల్ వద్దే ఉన్న స్విచ్ ను నొక్కితే సరిపోతుంది. దానికి సంబంధించిన లైట్ కస్టమర్ రాకను, అవసరాన్ని సూచిస్తూ వంటగదిలో వెలుగిపొతుంది. ఈ సమయంలో వారివద్ద ఉన్న మెనూ కార్డ్ తో పాటు పెన్ను, ప్యాడ్ అందించబడుతుంది.

ఆ మెనూలో ఫుడ్ ఐంటమ్స్ కి ఉన్న కోడ్ ను కస్టమర్ ఆ ప్యాడ్స్ పై నోట్ చేస్తారు. దీంతో.. కస్టమర్ కోరుకున్న ఫుడ్ వారికి అందించబడుతోంది. ఇక్కడకు వచ్చిన కస్టమర్స్ ఈ సంజ్ఞల వల్ల ఎలాంటి ఇబ్బందినీ అనుభవించరు. ఈ రెస్టారెంట్ అరేరా కాలనీకి దగ్గరగా ఉండటంతో ధనవంతుల కుటుంబాలవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారని చెబుతున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన మేనేజర్ శివాంశ్ కన్వర్... ఈ వెంచర్‌ ను ప్రారంభించిన ఉద్దేశ్యం కేవలం వికలాంగులకు ఉపాధి కల్పించడమే కాదని.. వారి ప్రత్యేక అవసరాల గురించి సమాజంలో అవగాహన కల్పించడం కోసం కూడా అని వెల్లడించారు. వీరి సర్వీస్ తో కస్టమర్లు సంతృప్తి చెందుతారని, గౌరవం ఇచ్చి వెళ్తారని తెలిపారు.

అలా అని ఇక్కడ అంతా పూర్తి సైలంట్ గా ఏమీ ఉండదు. ఇక్కడ కస్టమర్లు తక్కువ వాల్యూమ్‌ లో ప్లే చేస్తూ సంగీతాన్ని ఆస్వాదిస్తూ, వారికి నచ్చిన ఫుడ్ ని ఆరగించొచ్చు. ఈ సందర్భంగా... ఇలాంటి రెస్టారెంట్లు దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కస్టమర్లు సూచిస్తున్నారు.