Begin typing your search above and press return to search.

మీ మొబైల్ కు ఈ-చలానా వచ్చిందా? బీకేర్ ఫుల్

తాజాగా అలాంటి కొత్త ఎత్తును తెర మీదకు తెచ్చారు సైబర్ కిలాడీలు. ఆ మధ్యన మీ ఇంటి కరెంటు బిల్లు ఇంకా చెల్లింపులు జరపలేదని..

By:  Tupaki Desk   |   16 Oct 2023 9:30 AM IST
మీ మొబైల్ కు ఈ-చలానా వచ్చిందా? బీకేర్ ఫుల్
X

ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులతో కన్ఫ్యూజ్ చేసి.. ఆందోళనతో వారికి తగ్గట్లుగా మార్చుకొని.. దోచేసే తీరు సైబర్ దొంగలు చేస్తుంటారు. తాజాగా అలాంటి కొత్త ఎత్తును తెర మీదకు తెచ్చారు సైబర్ కిలాడీలు. ఆ మధ్యన మీ ఇంటి కరెంటు బిల్లు ఇంకా చెల్లింపులు జరపలేదని.. ఆలస్యం చేస్తే మీ ఇంటి కనెక్షన్ డిస్ కనెక్టు చేస్తామని హెచ్చరికలు చేసేసి.. ఎందరి జేబులో కొల్లగొట్టిన సైబర్ దొంగలు ఇప్పుడు మీ వెహికిల్ చలానా పెండింగ్ ఉందని.. వెంటనే కట్టకుంటే జైలుకు వెళతారన్న దొంగ హెచ్చరికలు చేస్తూ దోచేస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా మీ వాహనం మీద పోలీసుల చలానా పెండింగ్ ఉందని.. వెంటనే ఆ బకాయిల్ని క్లియర్ చేయకుంటే జైలుకే అంటూ దడ పుట్టించే మెసేజ్ ను ఫోన్ కు పంపటం.. ఇప్పటికిప్పుడు కడితే 50 శాతం రాయితీ కూడా అన్న ఊరింపుతో ముగ్గులోకి లాగేసే సరికొత్త దందా ఇప్పుడు ఎక్కువైంది. ఈ-చలనా పేరుతో దొంగ మెసేజ్ లు పంపేస్తున్నారు. చలానాలో పేర్కొన్న మొత్తం తక్కువే కదా.. కట్టేస్తే ఒక తలనొప్పి తీరిపోతుందని అనుకుంటే మొత్తంగా మునిగినట్లే.

వారు పంపిన లింకును క్లిక్ చేస్తే.. ఫోన్ హ్యాక్ కావటం లేదంటే.. సైబర్ దొంగలు కోరుకున్న యాప్ లు మన ఫోన్ లో డౌన్్ లోడ్ అవుతాయి. అంతేకాదు.. మన డేటా వారి చేతుల్లోకి వెళ్లే ఛాన్సు ఉంటుంది. అంతా బాగానే ఉంది కానీ.. వాహనాల నెంబర్లు.. ఫోన్ నెంబర్లు సైబర్ దొంగల చేతికి ఎలా వెళుతున్నాయన్నది చూస్తే.. కొందరు ప్రైవేటు ఉద్యోగులకు డబ్బులు ఇచ్చి.. వారి నుంచి డేటా కలెక్టుచేయటం.. ఈ దొంగ దందాకు తెర తీస్తున్నారు సైబర్ దొంగలు.

మీ ఫోన్ కు ఈ-చలానా పేరుతో దొంగ సందేశాలు వస్తే వెంటనే వాటిని డిలీట్ చేయటం ఉత్తమం. ఒకవేళ పొరపాటున వారి ఉచ్చులో పడి.. డబ్బులు పోగొట్టుకున్న పక్షంలో నిమిషాల వ్యవధిలో 1930 టోల్ ఫ్రీ నెంబరుకు.. పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో పోలీసులు సైతం ఇలాంటి మెసేజ్ లు పంపుతుంటారు. మరి.. వాటిని ఎలా గుర్తించాలంటే.. ఎప్పుడైనా మెసేజ్ వస్తే.. వెంటనే పోలీసుల ఈ-చలనా వెబ్ సైట్ లో చెక్ చేసుకొని.. అక్కడే బిల్లు కట్టేస్తే సరిపోతుంది. అనుమానాస్పదంగా ఉన్న లింకుల్ని తొందరపడి క్లిక్ చేస్తే మాత్రం మొదటికే మోసం అన్నది మర్చిపోవద్దు. బీకేర్ ఫుల్.