Begin typing your search above and press return to search.

తెలంగాణ సర్కార్ బూమ్ రాంగ్ !?

కానీ ఇవన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం క్యాబినెట్ సమావేశం అంటూ హంగామా చేసింది.

By:  Tupaki Desk   |   19 May 2024 5:31 PM IST
తెలంగాణ సర్కార్ బూమ్ రాంగ్ !?
X

దేశవ్యాపితంగా లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో ఏం జరగాలన్నా అంతా ఎన్నికల కమీషన్ పరిధిలోనే ఉంటుంది. కానీ ఇవన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం క్యాబినెట్ సమావేశం అంటూ హంగామా చేసింది.

సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుందని ఆర్బాటంగా ప్రకటించింది. కానీ చివరకు అది ఫెయిలయ్యింది. మొత్తానికి సచివాలయానికి ఉన్న 11 మంది మంత్రులలో కేవలం ముగ్గురే వచ్చారు.

ఉదయం రేవంత్ ని అతని నివాసంలోనే కలిసిన మంత్రి కోమటిరెడ్డి సచివాలయం వైపు రాలేదు. ఇక ఇంటి వద్దనే ఉన్న కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ భేటీకి అనుమతి కోసం ఈసీని కోరదామని శనివారం ఢిల్లీ ప్రోగ్రాం పెట్టాడు సీఎం రేవంత్.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని ఎన్నికల కమీషన్ సూచించింది. జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సినటువంటి అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం అన్నీ తెలిసి తప్పటడుగు వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.