‘నాలుగేళ్లుగా ఎడబాటు ఎరుగని ప్రేమ మాది’... దువ్వాడ శ్రీను - మాధురి కామెంట్స్!
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి (జంట) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ఫేమస్ అయిపోయారు వీరిద్దరూ!
By: Tupaki Desk | 19 Jun 2025 10:53 PM ISTదువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి (జంట) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ఫేమస్ అయిపోయారు వీరిద్దరూ! వీరికి సంబంధించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతోంది. ఇక వీళ్లిద్దరూ కలిసి చేసే డ్యాన్సులకు ఫ్యాన్స్ పుట్టుకొచ్చిన పరిస్థితి. ఈ సమయంలో వీరి బంధం గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్, మాధురి!
అవును... దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి గురించి ప్రస్థావిస్తే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వ్యూస్ వర్షం, కామెంట్ల తుఫాను చెలరేగుతుందని చెప్పినా అతిశయోక్తి కాదేమో! వీరిని అభిమానిస్తూ వారి వీడియోలు చూస్తున్నారా.. లేక, విమర్శించాలనే దృక్పథంతో చూస్తున్నారా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ‘చూస్తున్నారు’ అనేది మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలో తాజాగా వీరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా... తమ మధ్య అందరిలాగానే అలకలు, కోపాలు ఉంటాయని శ్రీను, మాధురి చెప్పారు. ఇందులో భాగంగా.. "నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన వినరు.. అప్పుడు నాకు కోపం వస్తుంది. అది 5 నిమిషాల్లో పోతుంది.. నేను ఆయనతో మాట్లాడకుండా అంతకంటే ఎక్కువసేపు ఉండలేను. ఆ తర్వాత నాకు సారీ చెప్పేస్తే మాట్లాడేస్తానని నేనే వెంటపడుతుంటాను" అని మాధురి అన్నారు.
ఇదే సమయంలో.. ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ అనే ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించిన మాధురి... "అతనికే కోపం ఎక్కువ.. నాకు అలకలు ఎక్కువ" అని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన శ్రీను... "తను ఎప్పుడూ ప్రేమగా ఉంటుంది.. ప్రేమ ముందు ఏదైనా సరే లొంగిపోవాల్సిందే.. ప్రేమ ముందు ఏదైనా ఓడిపోతుంది.. అందుకే సారీరా అనేస్తాను" అని చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలో... తాము ఎప్పుడూ విడిగా లేమని చెప్పిన మాధురి.. "ఇంతవరకూ నన్ను వదిలి అతను ఎక్కడికీ పోలేదు ఒక్కరోజు కూడా.. మేము నాలుగేళ్లుగా కలిసి ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకూ నన్ను వదిలి వెళ్లలేదు" అని తెలిపారు. ఈ నేపథ్యంలో... వేలంటైన్స్ డే సందర్భంగా మాధురి ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పింది అని శ్రీను తమ కొత్త వ్యాపారం గురించి వివరించారు.
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోపాలు, అలకలు, ప్రేమ, ఎడబాటు, విడిచి ఉండలేకపోవడం వంటి విషయాలపై వీరు చెప్పిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!
