డ్యాన్స్ తో దుమ్మురేపిన దువ్వాడ, మాధురి జంట.. వీడియో వైరల్!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే.
By: Tupaki Desk | 11 Jun 2025 10:02 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే. వీరిద్దరి ప్రేమ కథకు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని చెబుతారు. వీరిద్దరూ కలిసి ఇచ్చే ఇంటర్వ్యూలు ఫుల్ ఫేమస్! అలాంటి జంట డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? పాటకు తగ్గ స్టెప్పులతో హల్ చల్ చేస్తే ఎలా ఉంటుంది? తాజాగా అదే జరిగింది! వారి డ్యాన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అవును... దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి స్టేజ్ పై డ్యాన్స్ తో అదరగొట్టారు. దివ్వెల మధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట సందడి చేసింది. ఇందులో భాగంగా స్టెప్పులతో ఈ జంట చేసిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. సూపర్ కాస్ట్యూంస్ తో పాటకు తగ్గ స్టెప్పులతో స్టేజ్ ను షేక్ చేశారు.
ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో మెసేజ్ లతో కళకళలాడిపోతుంది. శంషాబాద్ శివారులోని ఓ రిసార్ట్ లో జరిగిన మాధురి కుమార్తె ఆఫ్ శారీ ఫంక్షన్ లో ఈ జంట స్టేజ్ పై అలరించింది. దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫంక్షన్ లో అంతా తానై వ్యవహరించారు! ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెలక్టెడ్ పర్సన్ ని ఆహ్వానించారు!
కాగా... దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చి వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వకుళ సిల్క్స్ పేరిట వస్త్ర వ్యాపారం మొదలుపెట్టారు. దీంతో.. ఇటీవల ఎకువగా ఈ జంట హైదరాబాద్ లోనే ఉంటుందని అంటున్నారు. పైగా దువ్వాడను వైసీపీ సస్పెండ్ చేయడంతో.. ఆయన ఇప్పుడు పార్ట్ టైం పొలిటీషియన్ గా మారినట్లు చెబుతున్నారు!