అగ్గి పుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగానే.. కాదేదీ కండిషన్స్ కు అనర్హం అన్నట్లుగా ఉంది తాజాగా తెరపైకి ఓ వచ్చిన విషయం! ఇందులో భాగంగా... తాజాగా విమానాశ్రయంలో వీడ్కోలు సమయంలో ఇచ్చే కౌగిలింతలకు సమయ పరిమితిని విధించారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
అవును... న్యూజిలాండ్ లోని డునెడిన్ ఎయిర్ పోర్ట్ లో డ్రాప్-ఆఫ్ జోన్ లో వీడ్కోలు కౌగిలింతలపై ఓ కండిషన్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా... వీడ్కోలు తుది కౌగిలింత కేవలం మూడు నిమిషాలు మాత్రమే ఉండాలని.. అంతకు మించి ఎక్కువ సమయం కౌగిలించుకోవడానికి వీలు లేదంటూ ఆశ్చర్యకర కండిషన్ పెట్టారు.
ఈ మేరకు విమానాశ్రయం వద్ద ఓ సైన్ బోర్డును ఏర్పటు చేశారు అధికారులో. ఇందులో... గరిష్టంగా వీడ్కోలు కౌగిలింత సమయం 3 నిమిషాలుగా నిర్ణయించబడింది.. వీడ్కోలు కోసం దయచేసి కారు పార్క్ ని ఉపయోగించండి అని రాసి పెట్టారు! ఈ ఆశ్చర్యకరమైన కండిషన్ పై డ్యునెడిన్ ఎయిర్ పోర్ట్ సీఈవో డేనియల్ డి బోనో స్పందించారు.
ఇందులో భాగంగా... విమానాశ్రయాలను ఎమోషనల్ హాట్ స్పాట్లు అని తెలుపుతూనే.. 20 సెకన్ల కౌగిలింతకే అవసరమైనంత లవ్ హార్మోన్ విడుదలవుతుందని సైన్స్ చెప్పిందని.. ఇలా తక్కువ సమయంపాటే కౌగిలించుకోవడం వల్ల ఎక్కువమందికి అవకాశం లభిస్తుంద్ని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
ఈ సందర్భంగా... కౌగిలింతలకు కూడా కండిషన్స్ పెడతారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరికొంతమంది అయితే... ఇలాంటి నిబంధన అన్ని విమానాశ్రయాల్లోనూ తీసుకురావాలంటూ స్పందిస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా... ఈ షరతు మాత్రం ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.