Begin typing your search above and press return to search.

198 మందితో విమానం సిద్ధం... తాగి దొరికేసిన మహిళా పైలెట్!

సాధారణంగా రోడ్లపై టూ వీలర్ పైనో, ఫోర్ వీలర్ లోనో వెళ్తున్నప్పుడు పోలీసులు డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ చేయడం నిత్యం చూస్తూనే ఉంటారు!

By:  Tupaki Desk   |   24 July 2025 7:00 PM IST
198 మందితో విమానం సిద్ధం...  తాగి దొరికేసిన మహిళా పైలెట్!
X

సాధారణంగా రోడ్లపై టూ వీలర్ పైనో, ఫోర్ వీలర్ లోనో వెళ్తున్నప్పుడు పోలీసులు డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ చేయడం నిత్యం చూస్తూనే ఉంటారు! దొరికిన వారికి ఫైన్ వేయడం, కౌన్సిలింగ్, మరికొంతమందికి కొన్ని రోజుల జైలు మొదలైన పనిష్మెంట్స్ ఉంటాయి! ఈ క్రమంలో తాజాగా ఫ్లైట్ ఎక్కే ముందు ఓ మహిళా పైలెట్ తాగి పట్టుబడిన ఘటన తెరపైకి వచ్చింది.

అవును... స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ నుంచి న్యూయార్క్ కు డెల్టా విమానాన్ని నడిపే ముందు ఆల్కహాల్ పరీక్షలో ఓ మహిళా అమెరికన్ పైలెట్ దొరికేసింది! దీంతో... స్టాక్‌ హోమ్ విమానాశ్రయంలో ఆ మహిళా పైలట్ ను అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆ విమానాన్ని రద్దు చేయడంతో పాటు.. డెల్టా విమానయాన సంస్థకు భారీ జరిమానా విధించారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే.. జూలై 23, 2025న స్టాక్‌ హోమ్ నుండి న్యూయార్క్‌ కు విమానం ప్రయాణించాల్సి ఉంది. ఈ విమానం కోసం 198 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో... డెల్టా ఎయిర్ లైన్స్ పైలట్ ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ పరీక్షలో విఫలమయ్యారు. అధికారులు వెంటనే ఆ అమెరికన్ మహిళను అరెస్టు చేశారు.. విమానాన్ని రద్దు చేశారు.

ఇదే సమయంలో... మొత్తం 198 మంది ప్రయాణికుల్లో ఒక్కొక్కరికి $705 పరిహారం ఇవ్వాలని సూచించింది. దీంతో... మొత్తం 1,40,000 డాలర్లు ప్రయాణికులకు ప్రత్యక్ష చెల్లింపులు జరిగాయి. ఈ చెల్లింపులు కాకుండా... తదుపరి విమానం షెడ్యూల్ అయ్యే వరకూ వసతి, భోజనం కోసం అదనపు ఖర్చులు చెల్లించాలని సూచించింది!

కాగా... యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) నిబంధన 2018/1042 ప్రకారం... యూరోపియన్ యూనియన్ విమానాశ్రయాల నుండి పనిచేస్తున్న అందరు పైలట్లు, సిబ్బందికి ఇటువంటి తనిఖీలను తప్పనిసరి. ఇదే సమయంలో.. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్.. పైలట్లు విమానాలు నడిపే ముందు కనీసం 8 గంటలు మద్యం సేవించకుండా ఉండాలని నిర్దేశిస్తుంది.

కాగా... ఈ ఏడాది ప్రారంభంలో.. ఇద్దరు డెల్టా విమాన సహాయకులను నెథర్లాండ్ రాజధాని ఆమ్‌ స్టర్‌ డ్యామ్ లో విమానం బయలుదేరే ముందు అరెస్టు చేశారు. వీరిద్దరూ అమెరికాలో మద్యం సేవించినట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు! 2019లో స్కాట్లాండ్‌ లోని గ్లాస్గోలో యునైటెడ్ పైలట్లు తాగి ఉన్నట్లు గుర్తించబడిన తర్వాత జైలు పాలయ్యారు.