Begin typing your search above and press return to search.

తెలంగాణలో షురూ... 5 నిమిషాల్లో డ్రగ్స్ వాడకం గుట్టు రట్టు!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ డ్రగ్స్ విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Jan 2024 4:30 PM GMT
తెలంగాణలో షురూ... 5 నిమిషాల్లో డ్రగ్స్  వాడకం గుట్టు రట్టు!
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ డ్రగ్స్ విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన "సన్ బర్న్" ఈవెంట్ కు కూడా రేవంత్ సర్కారు అనుమతి ఇవ్వలేదు. డ్రగ్స్ వినియోగం జోరుగా సాగుతుందనే ఆరోపణలు ఉండటమే అందుకు కారణం అని తెలుస్తుంది!

ఇదే సమయంలో... నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ టెస్టులతో పాటు డ్రగ్స్ టెస్టులను కూడా నిర్వహించినట్లు కథనాలొచ్చాయి! ఈ స్థాయిలో డ్రగ్స్ ని అరికట్టే విషయంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ వారేవారిని ఇట్టే పసిగట్టేలా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... మొట్టమొదటిసారిగా తెలంగాణ పోలీసులు తమ అంబులపొదిలో డ్రగ్ పరీక్ష ఫలితాలను 5 నిమిషాల్లో అందించగల పరికరాలను సమకూర్చారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానం తాజాగా పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిందని తెలుస్తుంది. వీటిద్వారా డ్రగ్స్ వాడేవారిని గుర్తించేందుకు యూరినల్ టెస్ట్ ను ఉపయోగించడం ప్రారంభించినట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రకటించింది.

ఈ పరికరాలను ఉపయోగించి... ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో "మూత్ర పరీక్ష" ద్వారా 19 రకాల మందులను గుర్తించవచ్చని... "సలైవా" (లాలాజల) పరీక్ష ద్వారా ఏడు రకాల డ్రగ్స్ ను తీసుకున్నారో లేదో కనిపెట్టేయవచ్చని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే కొంత మందిపై ఈ తరహా పరీక్షలు నిర్వహించగా.. 9 కేసుల్లో డ్రగ్ టెస్ట్‌ లో పాజిటివ్‌ గా వచ్చిందని అంటున్నారు.