Begin typing your search above and press return to search.

రూ.2 లక్షల ఆదాయం వదిలేసి.. ఈ గబ్బు పనులేంటి!

కిలేడీ అనురాధ సొంతూరు కరీంనగర్ జిల్లా గన్నేరుగూడ. ఏంబీఏ పూర్తి చేసిన ఆమె హైదరాబాద్ కు కొన్నేళ్ల క్రితం వచ్చింది

By:  Tupaki Desk   |   15 Sep 2023 4:19 AM GMT
రూ.2 లక్షల ఆదాయం వదిలేసి.. ఈ గబ్బు పనులేంటి!
X

డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్న అనురాధ అన్న కిలేడీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యన రావటం.. వాటికి మీడియాలో పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవటం తెలిసిందే. మొదట్లో జరిగిన తప్పును మీడియా గుర్తించింది. ఆమెను పెద్ద సీరియస్ గా తీసుకోని క్రైం రిపోర్టర్లు.. మీడియా సంస్థలు అమ్మగారి టాలెంట్ గురించి తెలిసినంతనే అవాక్కు అవుతున్నారు. ఆమెకు సంబంధించిన వివరాల్ని సేకరిస్తున్న కొద్దీ.. ఇంత కిలేడీని మొదట్లో ఇంత తక్కువ అంచనా వేశారా? అనిపించక మానదు. ఆమెకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో సోదాలు నిర్వహించి దాదాపు రూ.14 లక్షలు విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు.

ఆమెను విచారించే క్రమంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అధినేత ప్రభాకర్ రెడ్డి.. లను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అనురాధను విచారించే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చిన పరిస్థితి. ఇంతకీ అనురాధ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అమెఈ డ్రగ్స్ దందాలోకి ఎందుకు వచ్చింది? ఆమె ఆర్థిక పరిస్థితి ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఊహించని రీతిలో ఆమె వివరాలు ఉండటం గమనార్హం.

కిలేడీ అనురాధ సొంతూరు కరీంనగర్ జిల్లా గన్నేరుగూడ. ఏంబీఏ పూర్తి చేసిన ఆమె హైదరాబాద్ కు కొన్నేళ్ల క్రితం వచ్చింది. నానక్ రాంగూడ టీఎన్జీవోస్ కాలనీలో ఆమె ఉండేది. గచ్చిబౌలిలోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలు జాబ్ చేసేది. ఆకర్షణీయమైన జీతంతో పాటు.. సొంతూరులో ఉన్న షాపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కలిపితే దాదాపు రూ.2 లక్షల వరకు నెల నెలా చేతికి వచ్చే పరిస్థితి. ప్రేమ పెళ్లితో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఆమె.. భర్తతో విభేదాలతో విడాకులు తీసుకుంది.

పార్టీలు.. పబ్ లతో మొదలైన ఆమె జర్నీ చాలా తక్కువ వ్యవధిలోనే గోవా టూర్లు.. డ్రగ్స్ దందాలోకి అడుగుపెట్టేసింది. చెడు వ్యసనాలకు బానిసగా మారిందని చెబుతారు. గోవాలో అనురాధకు జేమ్స్ అనే వ్యక్తి పరిచయం కావటం.. అప్పటివరకు డ్రగ్స్ వినియోగించే ఆమె.. వాటిని అమ్మే స్థాయికి చేరుకుంది. గ్రాము డ్రగ్స్ ను రూ.10వేలకు కొని.. రూ.20వేలకు అమ్మేు ఆమె.. రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ ను తీసుకొచ్చేది.

ఈ క్రమంలోనే వరలక్ష్మి టిఫన్స్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డితో పరిచయం ఏర్పడటం.. అనురాధ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేయటంతో వారి మధ్య బంధం మరింత బలపడింది. షాకింగ్ విషయం ఏమంటే.. వరలక్ష్మి టిఫిన్ సెంటర్లోనే వీరు డ్రగ్స్ తీసుకునే వారని చెబుతున్నారు. టిఫిన్ సెంటర్ కు వచ్చే వారిలో కొందరిని అనురాధ ట్రాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె దగ్గరి కస్టమర్ లిస్టును డీ కోడ్ చేస్తే మరిన్ని సంచలనాలు బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.