Begin typing your search above and press return to search.

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేస్... బయటపడ్డ సినిమా లింక్స్?

హైదరాబాద్ లో ఎక్కడ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినా... దానికీ, ఇండస్ట్రీకీ బీరకాయ పీచు సంబంధం అయినా ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   20 Sep 2023 1:44 PM GMT
మాదాపూర్‌  డ్రగ్స్‌  కేస్... బయటపడ్డ సినిమా లింక్స్?
X

గతకొంతకాలంగా డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింకులు అనే ఏపీసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఎక్కడ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినా... దానికీ, ఇండస్ట్రీకీ బీరకాయ పీచు సంబంధం అయినా ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మాదాపూర్ డ్రగ్స్ కేసులో అంతకు మించిన సంబంధమే ఉందని తెలుస్తుంది.

అవును... మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో నిందితుల సెల్‌ ఫోన్లలో పలువురు సినీ ప్రముఖుల ఫోన్‌ నంబర్లను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో డ్రగ్స్ ద్వారా ఏర్పడిన పరిచయాలు, అనంతరం జరిగిన పరిణామాలతోనే పలువురు సినీ నిర్మాతలుగా అవతారం ఎత్తుతున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా తొలుత నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేయడం, తర్వాత రేవ్‌ పార్టీలని పెట్టి.. సినీ, రాజకీయ మిత్రులను ఆహ్వానించడం.. ఆ తర్వాత మత్తుపదార్థాలు ఎరవేసి అమ్మాయిలను రప్పించడం, ప్రముఖుల పరిచయాలను పెంచుకోవడం వీరి దందాలో అసలు విషయం అన్ని తెలుస్తుంది.

ఇలా ఒక సిస్టమెటిక్ గా వ్యవహారం నడిచిన అనంతరం వీరిని అడ్డుపెట్టుకొని సినీ నిర్మాతలుగా అవతారం ఎత్తుతున్నారట. ఈ క్రమంలో... మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల అసలు రూపాలు ఇవే అని సమాచారం! ఈ క్రమంలోనే ఈ నిందితుల కాల్‌ డేటాలో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఫోన్‌ నంబర్లను యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు గుర్తించారని అంటున్నారు.

కాగా.. ఇటీవల అరెస్టయిన 8 మంది నిందితులకు పోలీసు కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే భాస్కర్‌, మురళీ వెంకట రత్నారెడ్డి లను అరెస్ట్‌ చేసినప్పుడు బయటపడిన సమాచారంతో ఈ నెల 14న ముగ్గురు నైజీరియన్లు సహా మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ రావు, రాంచంద్‌, కె.సందీప్‌, సుశాంత్‌ రెడ్డి, శ్రీకర్‌ కృష్ణప్రసాద్‌ లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు.