Begin typing your search above and press return to search.

హోటల్ లో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... వివాహిత వీడియో వైరల్!

అవును... ఉత్తరప్రదేశ్ లోని బడౌత్ పట్టణంలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి హోటల్ కి వెళ్లింది.

By:  Tupaki Desk   |   19 Jun 2025 3:00 PM IST
హోటల్  లో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... వివాహిత వీడియో  వైరల్!
X

సక్రమం కాని సంబంధాల వ్యవహారాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వివాహానికి ముందే అన్ని విషయాలపైనా ఎందుకు ఓపెన్ గా మాట్లాడుకోరో, ఎందుకు క్లారిటీగా ఉండరో తెలియదు కానీ.. పెళ్లైన తర్వాత మాత్రం పలువురు పక్క చూపులు చూడటం, పొరుగింటి పుల్ల కూర రుచులకు అరాటపడి, అలవాటు పడటం చేసి.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు!

ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో తెరపైకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాల వల్ల ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తుల వీడియోలు, వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.. హత్యలు చేసిన సంఘటనలూ జరిగాయి. ఈ సమయంలో.. ప్రియుడితో హోటల్ లో ఉండగా అక్కడకు వచ్చిన భర్తను చూసిన వివాహిత తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

అవును... ఉత్తరప్రదేశ్ లోని బడౌత్ పట్టణంలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి హోటల్ కి వెళ్లింది. ఈ సమయంలో సడన్ గా భర్త ప్రత్యక్షమయ్యాడు. దీంతో.. ఆ మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... 12 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేసింది. అనంతరం బైక్ పై పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా... 2019లో కాకోర్ గ్రామానికి చెందిన వ్యక్తిని సదరూ మహిళ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే పెళ్లికి ముందు నుంచి మహిళకు పలువురి పురుషులతో సంబంధాలు ఉన్నట్లుగా భర్త ఆరోపిస్తుండటం, ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆమె ప్రవర్తన ఉండటంతో నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవంట.

ఈ క్రమంలో... సోమవారం బరౌత్ పట్టణంలోని చప్రౌతి రోడ్డులోని ఒక హోటల్‌ కు ప్రియుడితో కలిసి ఆ వివాహిత వచ్చింది. అయితే... వీరిద్దరూ హోటల్‌ కు బయల్దేరిన దగ్గర నుంచి భర్త, అత్తమామలు వెంబడిస్తూ వచ్చారట. ఇక హోటల్‌ కు వచ్చాక.. హఠాత్తుగా భర్త ప్రత్యక్షమయ్యాడట. దీంతో.. మహిళ 12 అడుగుల ఎత్తులోంచి కిందకు దూకేసింది.

అనంతరం బైక్‌ పై పారిపోయింది. ఈ క్రమంలో.. విషయం అర్ధం కాని ఆమె ప్రియుడు అక్కడే ఉండిపోవడంతో.. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా... తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.