Begin typing your search above and press return to search.

హై అలర్ట్.. మరో సునామీ హెచ్చరిక, ప్రమాద తీవ్రత ఎంతంటే..?

గత నెలలో భయపెట్టిన సునామీని మరువక ముందే మరో సునామీ హెచ్చరిక వచ్చింది. ఈ ఉదయం దక్షిణ అమెరికాను భూ కంపం వణికించింది.

By:  Tupaki Desk   |   22 Aug 2025 12:01 PM IST
హై అలర్ట్.. మరో సునామీ హెచ్చరిక, ప్రమాద తీవ్రత ఎంతంటే..?
X

గత నెలలో భయపెట్టిన సునామీని మరువక ముందే మరో సునామీ హెచ్చరిక వచ్చింది. ఈ ఉదయం దక్షిణ అమెరికాను భూ కంపం వణికించింది. డ్రిక్ పాసేజ్ లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.5 గా నమోదైంది. భూ ఉపరితలానికి 11 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూఎస్ జియోలాజికల్ సర్వే కథనం ప్రకారం ఈ భూకంపంతో సునామీ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. దీంతో చిలీ తీరానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

దక్షిణ అమెరికా, అంటార్కిటికా మధ్య డ్రీక్ పాసేజ్ వద్ద భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇటీవల రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రత నమోదైంది. ఈ భారీ భూప్రకంపనల ధాటికి రష్యా, జపాన్ దేశాలు అల్లాడిపోయాయి. అయితే ముందస్తు జాగ్రత్తలతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. పసిఫిక్ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపంగా రికార్డులు చెబుతున్నాయి.

ఇక తాజా భూకంపంతో చిలీలో హై అలర్ట్ ప్రకటించారు. గత మే నెలలో కూడా చిలీ దక్షిణ తీరంలో భూ కంపం వచ్చింది. 7.4 తీవ్రతో సంభవించిన భూ కంపంతో అప్పట్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మాగల్లనెస్ లోని తీర ప్రాంతాన్ని ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా భూ కంపం సంభవించిన ప్రాంతంలో తరచూ అలల ఉదృతి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఏప్రిల్ లో డ్రేక్ పాసేజ్ లో 40 అడుగుల అల ఒకటి విలాసవంతమైన భారీ ఓడను ఢీకొన్ని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.