Begin typing your search above and press return to search.

మీరు రైలు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారా? దీన్ని అస్సలు మిస్ కావొద్దు!

అయితే.. అలాంటి వారిలో కొందరికి కారణాలు ఏమైనా కానీ తాము ఎక్కాల్సిన స్టేషన్ లో కాకుండా తర్వాతి స్టేషన్ లో రైలు ఎక్కేస్తుంటారు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 7:30 AM GMT
మీరు రైలు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారా? దీన్ని అస్సలు మిస్ కావొద్దు!
X

రైలు ప్రయాణాలు చేసే సమయంలో చాలామంది ఒక స్టేషన్ నుంచి తాము రైలు ఎక్కుతామని సీటు లేదంటే బెర్తు రిజర్వు చేసుకోవటం తెలిసిందే. అయితే.. అలాంటి వారిలో కొందరికి కారణాలు ఏమైనా కానీ తాము ఎక్కాల్సిన స్టేషన్ లో కాకుండా తర్వాతి స్టేషన్ లో రైలు ఎక్కేస్తుంటారు. అలాంటి పరిస్థితులకు సంబంధించి టీటీఈలో ప్రయాణికులు తాము ఎక్కాల్సిన స్టేషన్ లో కాకుండా రెండు స్టేషన్ల వచ్చే వరకు ఆగి.. అప్పటికి సదరు ప్రయాణికుడు రైలు ఎక్కకపోతే.. వారికి సంబంధించిన సీటు/బెర్తును వేరు ప్రయాణికుడికి కేటాయించటం పాత పద్దతి.

ఇప్పుడు పరిస్థితులు మారాయి. పాత విధానాన్ని ఫాలో అయితే.. మీ సీటు/బెర్తు వేరే ప్రయాణికుడికి కేటాయించే వీలుందన్న విషయాన్ని గుర్తించాలి. లేదంటే.. తిప్పలు తప్పవు. ‘‘మా సీటు/బెర్తును మాకు కేటాయించాలి’’ అంటూ వాదులాటకు దిగితే కుదరదు. ఎందుకుంటే.. రైల్వేల్లో ఇప్పుడు పద్దతులు మారాయి. గతంలో మాన్యువల్ విధానంలో టీసీ ప్రయాణికుడు తాను ఎక్కాల్సిన స్టేషన్ లో ఎక్కకుండా తర్వాతి స్టేషన్ లో ఎక్కినప్పటికి వెయిట్ చేసే విధానం ఉండేది.

కానీ.. ఇటీవల కాలంలో టీసీలకు ట్యాబ్ లు కేటాయించిన నేపథ్యంలో.. ఒక ప్రయాణికుడు తాను ఎక్కాల్సిన స్టేషన్ లో ఎక్కని పరిస్థితుల్లో.. అతని సీటు/బెర్తును వేరే ప్రయాణికుడికి ఇచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవచ్చు. దీనికి సంబంధించి అలా ఎలా సీటు/బెర్తును వేరే వారికి కేటాయిస్తారని ప్రశ్నించే వీల్లేదు. ఒకవేళ.. బుక్ చేసిన టికెట్ ఒక స్టేషన్ లో.. ట్రైన్ ఎక్కేది మరో స్టేషన్ లో అయితే.. బోర్డింగ్ వివరాల్ని మార్చుకోవాలే తప్పించి.. నా ఇష్టం వచ్చిన స్టేషన్ లో ఎక్కుతా.. నా సీటు/బెర్తును నా పేరు మీదనే ఉండాలంటే మాత్రం కుదరదు. సో.. రైలు ప్రయాణాలు చేసే వారంతా మారిన తాజా అంశాన్ని గుర్తించి.. అందుకు తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.