Begin typing your search above and press return to search.

లెక్క‌లు రావా.. ష‌ర్మిల‌మ్మా..!

తాజాగా నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో ప‌ర్య‌టించిన ష‌ర్మిల‌.. ఇక్క‌డి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 1:30 AM GMT
లెక్క‌లు రావా.. ష‌ర్మిల‌మ్మా..!
X

ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌కు నెటిజ‌న్ల నుంచి ఘాటు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. లెక్క‌లు రావా? ష‌ర్మిల‌మ్మా అంటూ.. కామెంట్లు కురుస్తున్నాయి. దీనికి కార‌ణం.. ఆమె రెచ్చిపోయి చేసిన వ్యాఖ్య‌లే. తాజాగా నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో ప‌ర్య‌టించిన ష‌ర్మిల‌.. ఇక్క‌డి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ స‌మ‌యం లో రాష్ట్ర వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అందులోనూ.. అప్పులు.. సొమ్ముల గురించి ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

ఏపీ వైసీపీ ప్ర‌భుత్వం దాదాపు 8 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగానే అప్పులు చేసింద‌న్న వైఎస్ ష‌ర్మిల‌.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం 1.8 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసింద‌ని వెల్ల‌డించారు. రాష్ట్ర చ‌రిత్ర‌లోనే వైసీపీ ఎక్కువ మొత్తం లోనే అప్పులు తెచ్చింద‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో ఈ సొమ్ములు ఏం చేశారండీ జ‌గ‌న‌న్న‌గారూ! అని ష‌ర్మిల దీర్ఘం తీసి మ‌రీ ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ``రాష్ట్రంలో జ‌గ‌న‌న్న‌గారి ప్ర‌భుత్వం 8 ల‌క్ష‌ల కోట్లను అప్పు చేసింది. ఈ సొమ్ములు ఏం చేశారో.. జ‌గ‌న‌న్న‌గారు చెప్పాలి`` అని ష‌ర్మిల నిల‌దీశారు.

అంతేకాదు.. ప్రాజెక్టులు క‌ట్టారా? పోల‌వ‌రం క‌ట్టారా? ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేశారా? రోడ్లు వేశారా? అం టూ.. ష‌ర్మిల వైసీపీపై విరుచుకుప‌డ్డారు. అయితే.. ఆమె చేసిన కామెంట్ల‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ లు వ‌స్తున్నాయి. లెక్క‌లు చూసుకో ష‌ర్మిల‌క్కా.. అని కొంద‌రు అంటే.. లెక్క‌లు రావా మేడం అంటూ.. మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. దీనికి కార‌ణం.. అంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు చేయ‌లేదని కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన విష‌యం ఒక‌టి కాగా.. ఆ సొమ్ముల్లో స‌గం ప్ర‌జ‌ల ఖాతాల్లోకే నేరుగా వెళ్ల‌డం రెండోది.

వైసీపీ ప్ర‌భుత్వం మొత్తం అప్పులు 4.2 ల‌క్ష‌ల కోట్లు.. అని ఇటీవ‌లే పార్ల‌మెంటులో వెల్ల‌డించారు. ఇక‌, ఈ అప్పులును కూడా వైసీపీ ప్ర‌భుత్వం వివిధ వ‌ర్గాల వారికి సంక్షేమ ప‌థ‌కాల కింద నిధుల‌ను నేరుగా వారి ఖాతాల్లో జ‌మ చేసింది. అమ్మ ఒడి కింద 15000, ఆస‌రా కింద 18000, వాహ‌న మిత్ర కింద 10000, సున్నా వ‌డ్డీ రుణాల జ‌మ కింద మ‌హిళ‌ల ఖాతాల్లో 6000 పైచిలుకు కోట్లు.. నాడు-నేడు కింద పాఠ‌శాల‌ల బాగుజేత‌కు, ట్యాబుల కొనుగోలుకు చేస్తున్న ఖ‌ర్చు కూడా కోట్లల్లోనే ఉంది.

ఇక, ఇత‌ర ప‌థ‌కాలు.. ప్రాజెక్టులు కూడా సాగుతున్నాయి. ఇవ‌న్నీ.. చూస్తూ.. వింటూ కూడా.. ష‌ర్మిల ఏమీ తెలియ‌ని అమాయ‌కురాలిలాగా.. సొమ్ములు ఏం చేస్తున్నార‌ని ఎలా ప్ర‌శ్నిస్తార‌ని అంటున్నారు నెటిజ‌న్లు.