Begin typing your search above and press return to search.

డెడ్ లైన్ ఫిక్స్... ట్రంప్‌ కు 20 ఏళ్ల జైలు శిక్ష?

వచ్చే ఆరు నెలల్లోనే ట్రంప్‌ పై విచారణ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు

By:  Tupaki Desk   |   16 Aug 2023 5:49 AM GMT
డెడ్ లైన్ ఫిక్స్... ట్రంప్‌ కు 20 ఏళ్ల జైలు శిక్ష?
X

2020 ఎన్నికల్లో జార్జియాలో జో బిడెన్ విజయాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే అభియోగం కారణంగా... అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సంవత్సరాల వరకు జైలు శిక్షను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఈ సందర్భంగా డెడ్ లైన్ విదిస్తూ తాజాగా ఉత్తర్యులు విడుదలయ్యాయి!

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికలు - 2020లో భాగంగా జార్జియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నాటి దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓడిపోయినా.. ఆ ఫలితాన్ని తారుమారు చేయడానికి కుట్ర పన్నారని న్యాయ నిర్ణేతల సంఘం నేరాభియోగం నమోదు చేసింది. ఇందులో భాగంగా ట్రంప్‌ తో సహా మొత్తం 19 మందిపై అభియోగాలు నమోదయ్యాయి!

దీంతో... వీరంతా ఈ నెల 25 మధ్యాహ్నం లోపల స్వచ్ఛందంగా లొంగిపోవాలని జార్జియా రాష్ట్ర ఫుల్టన్‌ కౌంటీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఫానీ విలిస్‌ పేర్కొన్నారు. వచ్చే ఆరు నెలల్లోనే ట్రంప్‌ పై విచారణ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

జార్జియా కేసులో ట్రంప్.. తప్పుడు ప్రకటనలు, ఫోర్జరీ, ప్రమాణాలను ఉల్లంఘించమని ప్రభుత్వ అధికారులను అభ్యర్థించడం వంటివి మొత్తం 13 ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనపై వచ్చిన ఆరోపణలు, అవి రుజువైతే పడే శిక్షలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం!

వ్యవస్థను అవినీతి మయం చేసే క్రమంలో చట్టాలను ఉల్లంగించినందుకు గరిష్టంగా 20ఏళ్లు శిక్ష పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఒక ప్రభుత్వ అధికారిని వారి ప్రమాణాన్ని ఉల్లంఘించమని అభ్యర్థించారనే అభియోగం రుజువైతే ఒక్కో అభియోగానికీ 3 సంవత్సరాలు చొప్పున శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో... ప్రభుత్వ అధికారిగా నటించడానికి కుట్ర పన్నినందుకు 2.5 సంవత్సరాలు, ఫోర్జరీ చేయడానికి కుట్ర పన్నినందుకు ఏడున్నర సంవత్సరాలు, రెండు తప్పుడు స్టేట్ మెంట్ లు ఇచ్చినందుకు ఒక్కొదానికీ రెండున్నర సంవత్సరాలు, తప్పుడు పత్రాల దాఖలుకు సంబంధించి ఐదు సంవత్సరాలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

మొత్తంమీద ట్రంప్ ప్రస్తుతం నాలుగు క్రిమినల్ కేసుల్లో మొత్తం 91 నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించిన కేసు విచారణ ప్రక్రియ ప్రారంభమైతే అది టెలివిజన్‌ లో ప్రసారమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడి విచారణ టీవీలో ప్రసారమవడం మొదటిసారి అవుతుంది.

కాగా... 2020 ఎన్నికల్లో జార్జియాలో ట్రంప్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ బైడెన్‌ ను ఓడించాలంటే ట్రంప్‌ కు ఇంకా 11,780 ఓట్లు అవసరం. వాటిని ఎలాగోలా కనుగొనాలని ఆయన జార్జియా ఎన్నికల ప్రధానాధికారికి ఫోన్‌ లో చెప్పడం గురించి బయటకు పొక్కడంతో దర్యాప్తు మొదలైంది.