Begin typing your search above and press return to search.

మస్క్‌ కు ట్రంప్‌ బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చిన వేళ!

ఎలాన్‌ మస్క్‌ చాలా తెలివైన వ్యక్తి అని ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు.

By:  Tupaki Desk   |   20 Aug 2024 1:51 PM IST
మస్క్‌ కు ట్రంప్‌ బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చిన వేళ!
X

అపర కుబేరుడు, స్పేస్‌ ఎక్స్, టెస్లా, ఎక్స్, న్యూరాలింక్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ కు అమెరికా అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయితే ఎలాన్‌ మస్క్‌ ను తన కేబినెట్‌ లో చేర్చుకుంటానని తెలిపారు. లేదా సలహాదారుడిగానైనా అవకాశమిస్తానని చెప్పారు.

ఎలాన్‌ మస్క్‌ చాలా తెలివైన వ్యక్తి అని ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. మస్క్‌ పై ట్రంప్‌ ప్రశంసలు కురిపించడం ఇదే తొలిసారేమీ కాదు. గతంలో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు 2016లో మస్క్‌ ను కీలక సలహా మండళ్లకు అధిపతిగా నియమించారు. అయితే ఫ్రాన్స్‌ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా బయటకు రావడాన్ని నిరసిస్తూ మస్క్‌ తన పదవుల నుంచి 2017లో వైదొలగారు.

కాగా ఈ ఏడాది నవంబర్‌ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాన్‌ మస్క్‌.. ఆయనకు తన మద్దతును ప్రకటించారు. ఇటీవల వీరిద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించి.. వృథాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్‌ కు ఎలాన్‌ మస్క్‌ సూచించారు.