Begin typing your search above and press return to search.

బైడెన్ ఇండియాకు రాకపోవడానికి కారణం ట్రంపేనా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మరోమారు బరిలో ఉండటంతో బైడెన్ జంకుతున్నారు

By:  Tupaki Desk   |   14 Dec 2023 12:30 PM GMT
బైడెన్ ఇండియాకు రాకపోవడానికి కారణం ట్రంపేనా?
X

వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రాట్ల తరఫున జో బైడెన్, మరో అభ్యర్థిగా డొనాల్డ్ ట్ంప్ బరిలో నిలవనున్నారు. దీంతో ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంటోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో బైడెన్, ట్రంప్ మధ్య రాజకీయ పోరాటం రసవత్తరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఏడాది భారత్ లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు జోబైడెన్ రావాలని ఆహ్వానించింది. ముందు వస్తానని చెప్పడంతో ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ తరువాత బైడెన్ మాట మార్చారు. గణతంత్ర వేడుకలకు రాలేనని చెప్పడం ఆందోళనకు తావిస్తోంది. బైడెన్ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే వాదనలు వస్తున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మరోమారు బరిలో ఉండటంతో బైడెన్ జంకుతున్నారు. బైడెన్ కు ట్రంప్ దీటైన అభ్యర్థి అని నమ్ముతుండటంతో బైడెన్ లో భయం పట్టుకుంది. దీంతో మన గణతంత్ర వేడుకలకు రావడం వల్ల ట్రంప్ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని బైడెన్ భావిస్తున్నారు. అందుకే మన గణతంత్ర వేడుకలకు దూరంగా ఉండాలని చూస్తున్నట్లు సమాచారం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ తప్పదనే సంకేతాలు సర్వేలతో వస్తున్నాయి. దీంతో బైడెన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సర్వేలో 38 శాతం మంది ట్రంప్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బైడెన్ ప్రభుత్వంలోని మంత్రులు వరస పర్యటనలు చేస్తున్నారు. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే భారత్ లో పర్యటస్తున్నారు.

భారత్ లో రిపబ్లిక్ దినోత్సవం తరువాత క్వాడ్ సదస్సు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. బైడెన్ రాకపోవడంతో క్వాడ్ సదస్సు వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. 2019లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ట్రంప్ రావాలని కోరినా ఆయన హాజరు కాలేదు. బైడెన్ రాకపోతే ఇది రెండోసారి అమెరికా అధ్యక్షులు నిరాకరించినట్లు అవుతుంది.