Begin typing your search above and press return to search.

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

మనీలాలో జరిగిన క్వాడ్ సమావేశంలో గ్రూప్ ఫొటోకు సిద్ధమవుతున్న సమయంలో నేలపై ఉన్న భారత జెండా గుర్తును ప్రధాని మోదీ తీసి జేబులో పెట్టుకున్నారు. పక్కనే ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యను గమనించి ‘సేవ్ ఇట్’ అన్నారు. 2023లో బ్రిక్స్ సమావేశంలోనూ మోదీ ఇలాగే చేయడంతో, అప్పటి వీడియోను కూడా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Nov 2026 4:52 PM IST
జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?
X

మన జాతీయ జెండా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తనదైన శైలిలో వ్యవహరించారు. ఫొటో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో నేలపై కనిపించిన భారత జెండా గుర్తును అలాగే వదిలేయలేదు. కిందకు వంగి దాన్ని తీసి జేబులో పెట్టుకున్నారు. మనీలాలో జరిగిన క్వాడ్ సమావేశానికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

క్వాడ్ నేతల గ్రూప్ ఫొటో కోసం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కార్పెట్‌పై ఒక్కో దేశానికి సంబంధించిన జెండా గుర్తులను పెట్టారు. నేతలు ఎక్కడ నిలబడాలో గుర్తించేందుకు ఈ చిన్న పేపర్లను ఉపయోగించారు. తన స్థానం దగ్గరకు వచ్చిన మోడీకి భారత త్రివర్ణ పతాకం గుర్తు కనిపించింది. అది నేలపై ఉండటంతో వెంటనే తీసి జేబులో పెట్టుకున్నారు.

ఆ సమయంలో పక్కనే ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని గమనించారు. 'Save it' అని ఆయన అనడం వీడియోలో వినిపిస్తోంది.

మోడీ ఇలా చేయడం గతంలోనూ జరిగింది. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో కూడా ఫొటోకు ముందు నేలపై ఉన్న భారత జెండా గుర్తును ఆయన తీసుకున్నారు. ఇప్పుడు మనీలాలోనూ అదే తరహాలో వ్యవహరించడంతో ఆ పాత వీడియోను కూడా నెటిజన్లు మళ్లీ ప్రస్తావిస్తున్నారు.

ఈసారి మోడీ చేసిన పని కంటే.. పక్కనే ఉన్న ట్రంప్ ఇచ్చిన స్పందన కూడా వీడియో చూసినవారిని ఆకట్టుకుంటోంది.