కాశ్మీర్ పంచాయతీ కూడా ట్రంప్ దేనట !
అలాంటిది లక్కీ ట్రంప్ గద్దెనెక్కగానే భారత్ పాక్ మధ్య సమరం మొదలవడం దానిని ఆయన ఉఫ్ అంటూ అలా ఊదేయడంతో తానంటే ఏమనుకుంటున్నారు అని విజయ గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
By: Tupaki Desk | 11 May 2025 8:09 AMఅదేంటో ఎనభయ్యేళ్ళ వయసులో డొనాల్డ్ ట్రంప్ పంచాయతీలను తెగ హుషార్ గా చేసేస్తున్నారు. ఎక్కడా అలుపూ సొలుపూ లేకుండా ఒక్క సింగిల్ నైట్ డిస్కషన్స్ తో యుద్ధాలను అలా అరచేత్తో ఆపేస్తున్నారు. ఆ మీదట అంతా తన క్రెడిట్ ఖాతాలో వేసుకుని తెగ మురుస్తున్నారు. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఎందుకు ఆపలేకపోయారు అంటే జవాబు ఉండదు, ఇజ్రాయిల్ హమాస్ మధ్యన శాంతి ఎందుకు తేలేకపోయారో ట్రంప్ అసలు చెప్పలేరు.
ఇదంతా ఎందుకు కానీ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన దాని కంటే ఎక్కువ సంతోషం ట్రంప్ కి ఇండియా పాక్ మధ్య వార్ ఆపేసిన వార్త అందిస్తోంది. తానే ప్రపంచానికి అసలైన పెద్దన్న అని ఆయన ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. నిజానికి ఈ రోజున చూస్తే అంతర్జాతీయంగా అమెరికా ప్రాభవం తగ్గుతోంది.
ఏ దేశం పెద్దన్న మాటను వినడంలేదు. దాంతో అమెరికాలో అసహనం ఆక్రోశం అంతా ఇంతా కాకుండా ఉంది. అలాంటిది లక్కీ ట్రంప్ గద్దెనెక్కగానే భారత్ పాక్ మధ్య సమరం మొదలవడం దానిని ఆయన ఉఫ్ అంటూ అలా ఊదేయడంతో తానంటే ఏమనుకుంటున్నారు అని విజయ గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఈ జోష్ లో కొత్త హుషార్ లో ఆయన మరింత ముందుకు వచ్చేశారు. వేయేళ్ళ నుంచి వివాదంగా ఉన్న కాశ్మీర్ సమస్యను కూడా చిటికలో పరిష్కరిస్తాను అని కొత్త పంచాయతీకి సిద్ధపడుతున్నారు. అసలు కాశ్మీర్ వేయేళ్ళ సమస్య అనడంలోనే ఈ పంచాయతీ పెద్దకు కాశ్మీర్ మీద బొత్తిగా అవగాహన ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి కేవలం ఏడున్నర దశాబ్దాలుగానే కాశ్మీర్ అంశం ఉంది.
దానిని పట్టుకుని వేయి ఏళ్ళు అంటున్నారు ట్రంప్ మహాశయులు. ఇక కాశ్మీర్ సమస్యకు కూడా ఆయన వద్ద బ్రహ్మాండమైన పరిష్కారం ఉందిట. మరి ఇంకేం తొందరగా పంచాయతీ పెట్టి సెటిల్ చేస్తే బాగానే ఉంటుంది కదా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కాశ్మీర్ అన్నది భారత్ భూభాగంలో ఉంది. అది మా అంతర్భాగం అని భారత్ అంటోంది. అదే నిజం కూడా.
కాశ్మీర్ రాజు కూడా భారత్ లోనే తన సొంత రాజ్యాన్ని విలీనం చేశారు. ఇక ఆక్రమిత కాశ్మీర్ పేరుతో కబ్జా చేసి ఇంతకాలంగా దర్జా చేస్తున్నది పాకిస్థాన్. ట్రంప్ కనుక పంచాయతీ చేస్తే పాక్ వద్ద ఉన్న ఆ పీవోకేని భారత్ లో విలీనం అయ్యేలా చూస్తే బాగుంటుంది అని అంటున్నారు. అలా కాకుండా కాశ్మీర్ ఇద్దరిదీ అని ఏమైనా వింత తీర్పు చెబుతారా అని ఎకసెక్కమాడేవారూ ఉన్నారు. ఏది ఏమైనా ఇపుడు అంతర్జాతీయంగా ట్రంప్ రోజులు నడుస్తున్నాయి. అది కూడా భారత్ పాక్ పుణ్యమాని. సో ఆయన తొందరలో కాశ్మీర్ పంచాయతీ పెట్టే బిజీలో ఉన్నారు. చూడాలి మరి ఆయన మార్క్ పరిష్కారాలు ఏమిటో.