డాలి చాయ్ వాలా బిజినెస్ సీక్రెట్ ఇదే..! అంబానీని అందుకోవడం పక్కా..!
డాలి రోజుకు తక్కువలో తక్కువగా రూ. 5 లక్షల వరకు సంపాదిస్తాడు. ఇక బిల్ గేట్స్ రావడంతో అది మరింత పెరిగింది.
By: Tupaki Desk | 15 July 2025 9:00 PM ISTమహారాష్ట్రలోని పూణె పట్టణం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ముంబైని మించి పోయిన నగరంగా కనిపిస్తుంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పుట్టినిల్లు. అక్కడ అవకాశాలకు కొదువ లేదు. చిన్న చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరం మొత్తం సందడిగా ఉంటుంది. అలాంటి సిటీ నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులుగా మారారు. అందులో ఒకడు ‘డాలి చాయ్ వాలా’. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అతని చాయ్ తాగి కితాబు ఇవ్వడంతో మరింత ఫేమస్ అయ్యాడు.
డాలి చాయ్ వాలా అసలు పేరు సునీల్ పటేల్. నాగ్ పూర్ లో టీ షాపు నిర్వహిస్తూ ఫేమస్ అయ్యాడు. ఇతను టీ తయారు చేసే స్టయిల్, టీ రుచిగా ఉండడంతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సోషల్ మీడియా విస్తరిస్తున్న కాలంలో అంటే టిక్ టాక్ లాంటి షార్ట్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్న సమయంలో డాలి చాయ్ వాలా విపరీతంగా ఫేమస్ అయ్యాడు. ఎంతలా అంటే అంబానీ ఇంటికి ఫంక్షన్ కు వచ్చిన బిల్ గేట్స్ మొదట డాలి చాయ్ దుకాణం వెళ్లేంతగా.. అక్కడికి వెళ్లిన గేట్స్ సునీల్ పటేల్ తో మాట్లాడి ఆయన ఇచ్చిన టీ తాగి సూపర్ అంటూ కితాబిచ్చి మరీ వెళ్లాడు. దీంతో డాలి టీ స్టాల్ విపరీతంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆయన వెనుకకు తిరిగి చూడలేదు.
డాలి రోజుకు తక్కువలో తక్కువగా రూ. 5 లక్షల వరకు సంపాదిస్తాడు. ఇక బిల్ గేట్స్ రావడంతో అది మరింత పెరిగింది. దీన్నే వ్యాపారంగా చేయాలనుకొని ఫ్రాంచైజీ ఓపెన్ చేద్దాం అని ప్రకటన చేశాడు. తన ఫ్రాంచైజీలో ఏర్పాట చేసే స్టోర్లను మూడు విభాగాలుగా విభజించాడు. ఒకటి కార్ట్ స్టాల్, రెండు స్టాండర్డ్ స్టోర్, మూడు ప్లాగ్ షిప్ కేఫ్ ఒక్కో దానికి వరుసగా రూ. 4.5 నుంచి రూ. 6 లక్షలు, రూ. 20 లక్షల నుంచి రూ. 22 లక్షలు, రూ. 39 లక్షల నుంచి రూ. 43 లక్షలకు ప్రకటించాడు. ఈ స్టోర్లలో వాడే మొత్తం తయారీ సామగ్రిని సునీల్ పటేలే పంపిస్తాడట. చాయ్ లో కూడా డిఫరెంట్ ఫ్లెవర్లను కూడా తీసుకువస్తానని ఆయన ప్రకటించడం కొసమెరుపు.
సునీల్ పటేల్ కు ఉన్న గుర్తింపుతో డాలి చాయ్ పెద్ద ఎత్తున ఆదరణ చూరగొంటుందని బిజినెస్ పర్సన్లు భావిస్తున్నారు. ఆయన స్టోర్లకు అనౌన్స్ మెంట్ చేసిన రెండు రోజుల్లోనే 1600కు పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత ఊపు మీదున్న డాలి చాయ్ ప్రాంచైజీలు పెరిగితే అంబానీ, అదానిని చేరుకోవడం ఖాయం అంటున్నారు కొందరు నెటిజన్లు.
