Begin typing your search above and press return to search.

కన్నీటికే కన్నీరు... విమానంలో డాక్టర్ ఫ్యామిలీ చివరి సెల్ఫీ!

తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఒక ఫ్యామిలీ మృతి చెందింది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 10:33 AM IST
కన్నీటికే కన్నీరు... విమానంలో డాక్టర్  ఫ్యామిలీ చివరి సెల్ఫీ!
X

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలను చూడాలని బయలుదేరిన తల్లి తండ్రులు, భర్తతో కలిసి జీవించాలని ఎన్నో ఆశలతో విమానం ఎక్కిన నవ వధువు, కెరీర్ లో ఉన్నత శిఖరాలకు వెళ్లాలనుకున్న యువకులు ఇలా ఎందరో.. క్షణాల్లో మృతుఒడికి చేరుకున్నరు. ఈ సమయంలో ఓ డాక్టర్ ఫ్యామిలీ సెల్ఫీ కన్నీటికే కన్నీరు తెప్పిస్తోంది!

అవును... తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఒక ఫ్యామిలీ మృతి చెందింది. ఫ్యామిలీతో కలిసి లండన్ లో స్థిరపడాలనుకుని, ఎంతో ఆనందంగా తన భర్య, పిల్లలతో కలిసి విమాన ప్రయాణాన్ని ప్రారంభించిన వ్యక్తి.. ఆ జ్ఞాపకాలను ఫోన్ లో సెల్ఫీ రూపంలో బంధించారు. అయితే... అంతలోనే వారి కలలు కల్లలయ్యాయి. విమాన ప్రమాదంలో వారంతా మృతుఒడికి చేరుకున్నారు. వారే రాజస్థాన్ కు చెందిన డాక్టర్ ఫ్యామిలీ!

వివరాళ్లోకి వెళ్తే... రాజస్థాన్ కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె మిరియా (8), ప్రద్యుత్ - నకుల్ (5) అనే కవల కుమారులు ఉన్నారు. కోమి, జోషీలు ఉదయ్ పూర్ లోని ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహించేవారు. ఈ క్రమంలో జోషి ఇటీవలే లండన్ కు వెళ్లారు. ఈ క్రమంలో తన కుటుంబాన్ని కూడా లండన్ తీసుకెళ్లేందుకు రెండు రోజుల క్రితం ఇండియాకు వచ్చారు.

ఈ సమయంలో రెండు రోజుల పాటు ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసిన జోషి.. అనంతరం తన భార్య, పిల్లలతో కలిసి లండన్ బయలుదేరారు. ఈ సమయంలో తన భార్య పిల్లల్తో కలిసి సెల్ఫీ తీసుకొన్నారు. ఇది తమ జీవితంలో ఓ అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుందని భావించారు. అయితే.. తాజాగా విమాన ప్రమాదంలో కుటుంబం మొత్తం మృత్యుఒడికి చేరుకొంది.