సంచలనం... టీవీకే అంటే ‘త్రిష - విజయ్ - కీర్తి సురేష్’!
తమ్మిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పై పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 29 April 2025 8:52 AMవచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఈ సమయంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ పై డీఎంకే నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అక్షరాల్లో సినిమా హీరోయిన్స్ పేర్లు పెట్టి కామెంట్ చేశారు.
అవును... తమ్మిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పై పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే వ్యక్తి తమకు అవినీతి గురించి పాఠాలు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పిన ఆయన.. విజయ్ తీసుకునే రెమ్యునరేషన్ అంతా బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో.. "విజయ్ పార్టీ (టీవీకే) అంటే ఏమిటి? అని అక్కడున్న జనసమూహాన్ని పన్నీర్ సెల్వం కోరగా.. అక్కడున్నవారు “టీ-త్రిష, వీ-విజయ్, కే-కీర్తి సురేష్” అని సమాధానం ఇవ్వడం గమనార్హం. దీంతో... మీరంతా బ్రిలియంట్స్ అంటూ మంత్రి స్పందించారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోల్లు కాదని పన్నీర్ సెల్వం అన్నారు.
కాగా... 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానంగా డీఎంకే - టీవీకే మధ్య మాటల యుద్ధాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ సమయంలో... గత కొదీ రోజులుగా సీఎం స్టాలిన్ పై కొన్ని రోజులుగా విజయ్ ఘాటుగా స్పందిస్తున్నారు. అధికార పార్టీలో అవినీతి పెరిగిపోతుందంటూ పలు వేదికలపై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే టీవీకే విజయ్ ను డీఎంకే నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని నడపటం అంటే సినిమాల్లో నటించడం అంత సులభం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా... టీవీకే పార్టీ పేరులో హీరోయిన్స్ పేర్లు పెట్టిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.