ఎన్డీయే గూటికి స్టాలిన్...మంతనాలు స్టార్ట్ ?
జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు సంభవిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి మొదలవుతున్నాయి.
By: Satya P | 15 July 2026 1:00 PM ISTజాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు సంభవిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి మొదలవుతున్నాయి. ఈసారి వర్షాకాల సమావేశాలు వాడిగా వేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో దేశంలో రాజకీయ ప్రకంపనలు కూడా పెద్ద ఎత్తున సంభవించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మార్చి ఏప్రిల్ లో జరిగిన బడ్జెట్ సెషన్ లో లోక్ సభలో ఉన్న రాజకీయానికి కేవలం మూడు నెలల వ్యవధిలోనే భారీ మార్పు వర్షాకాల సెషన్ లో కనిపిస్తుంది అని అంటున్నారు. ఆ వైపున ఉన్న వారు ఈ వైపునకు వస్తారు అని అంటున్నారు. అందులో అందరినీ ఆకర్షిస్తోంది డీఎంకే వైఖరి. ఆనాడు అపొజిషన్ లో ఇండియా బ్లాక్ లో ఉంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించి మహిళా బిల్లుని అడ్డుకున్న డీఎంకే ఈసారి రైనీ సీజన్ లో ఏమి చేస్తుంది అన్నది అతి పెద్ద చర్చగా ముందుకు వస్తోంది.
స్టాలిన్ మీదనే ఫోకస్ :
ఇపుడు అందరి చూపూ స్టాలిన్ మీదనే ఉంది. ఆయన ఇండియా కూటమిలో అతి ముఖ్య నాయకుడిగా ఉంటూ వచ్చారు. లోక్ సభలో 22 మంది రాజ్యసభలో 8 మంది దాకా ఎంపీలతో పెద్ద పార్టీగా ఉన్న డీఎంకే తమిళనాడు ఎన్నికల తరువాత ఇండియా బ్లాక్ కి దూరం అయింది. విజయ్ కి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో డీఎంకే కూడా తన వైఖరిని మార్చుకుంది. కాంగ్రెస్ కి దూరం అని మొదట్లో చెప్పిన డీఎంకే ఇపుడు ఎన్డీయే కూటమికి చేరువ అవుతోంది అని హస్తినలో జోరుగా ప్రచారం సాగుతోంది. న్యూట్రల్ గా ఉంటూ పాలిటిక్స్ చేయడం కష్టం కాబట్టి డీఎంకే ఎన్డీయే వైపు ఉండాలని చూస్తోంది అని అంటున్నారు.
ఎన్డీయే పెద్దలకు టచ్ లో :
ఇదిలా ఉంటే డీఎంకే అధినేత తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ఢిల్లీలోని ఎన్డీయే పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రాజకీయాలో అభిమానాలు అన్నవి ఉండవని అవసరాలే ఉంటాయని ఎపుడూ రుజువు అవుతున్న విషయం. ఇక డీఎంకే విషయానికి వస్తే ఎన్డీయేలో గతంలో ఉంటూ మిత్రపక్షంగా పనిచేసింది. ఇపుడు కూడా డీఎంకే ఎన్డీయే సైడ్ తీసుకుంటే రాజకీయంగా అది సంచలనం అయినా రాజకీయలలో సాధారణంగానే చెప్పుకుంటున్నారు. ఇక డీఎంకే కనుక ఎన్డీయే వైపు వస్తే దేశ రాజకీయాలు అమాంతం మారిపోతాయని అంటున్నారు. ఎందుకంటే డీఎంకేకు లోక్ సభలో 22 మంది ఎంపీలు ఉంటే రాజ్యసభలో ఎనిమిది మంది ఉన్నారు. అంటే మొత్తంగా ముప్పై మంది ఎంపీలు అన్న మాట. ఈ బలం కనుక ఎన్డీయేకు సమకూరితే కచ్చితంగా ఎన్డీయేకు ఏనుగంత బలం వస్తుంది. రాజ్యాంగ సవరణలకు అవకాశం ఉన్న బిల్లులను సునాయాసంగా పార్లమెంట్ లో అమలు చేసుకుంటుంది అని అంటున్నారు. ఏకంగా పార్లమెంట్ లో మూడింట రెండు వంతుల బలం కూడా సమకూరుతుంది. అని గుర్తు చేస్తున్నారు.
ఆ బిల్లులు అన్నీ ఓకే :
మహిళా బిల్లుతో పాటు లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజన బిల్లు జమిలి ఎన్నికలు ఇంకా అనేక బిల్లులు అన్నీ బీజేపీ పార్లమెంట్ ఆమోదాన్ని ఈజీగా సాధిస్తుంది అని అంటున్నారు. ఇపుడు దేశ రాజకీయాలలో డీఎంకే వైఖరి కీలకం కానుంది. డీఎంకే కనుక తులసీదళం మాదిరిగా తన బలాన్ని ఎన్డీయేకు జత చేస్తే ఇండియా బ్లాక్ అంతా వెనక్కి పోయినట్లే అని అంటున్నారు. స్టాలిన్ అయితే తన రాజకీయం తో పాటు తమిళనాడులో డీఎంకే రాజకీయ అస్తిత్వం కోసం ఎన్డీయే వైపుగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మరి చూడాలి ఏమి జరుగుతుంది అన్నది.
