Begin typing your search above and press return to search.

రేవంత్ మాటలు బూమ్ రాంగ్ అయ్యాయా ?

తాజాగా ఈ వాఖ్యలపై మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు.

By:  Tupaki Desk   |   20 April 2024 9:14 AM GMT
రేవంత్ మాటలు బూమ్ రాంగ్ అయ్యాయా ?
X

మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం బూమ్ రాంగ్ అయిందా ? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటీవల రేవంత్ చేస్తున్న ప్రసంగాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాయా అంటే పార్టీ వర్గాలు నిజమే అంటున్నాయి. తాజా పరిణామాలు అదే విషయం స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా పాలమూరులో మాట్లాడిన రేవంత్ ‘’కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు మీరు ఎన్ని కుట్రలు చేసినా పండబెట్టి తొక్కుకుంటూ పోయి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని లోక్ సభకు పంపిస్తాం’’ అని అన్నాడు.

తాజాగా ఈ వాఖ్యలపై మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ‘’పండబెట్టి తొక్కుకుంటూ పోతావా ? ఎక్కడ తొక్కుతావే ప్లేస్ చెప్పు రేవంత్ .. నేను అక్కడికి వస్తా .. రేవంత్ వ్యాఖ్యలపై మొత్తం పాలమూరు మహిళలు స్పందించాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలి’’ అని పిలుపునిచ్చారు. రేవంత్ వ్యాఖ్యల్లో ఎక్కడా బీజేపీ, డీకే అరుణ ప్రస్తావన లేకపోయినా ఆమె స్పందించడం కలకలం రేపుతున్నది. ఈ పరిణామాలు పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడికి దారితీస్తాయో అని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.