Begin typing your search above and press return to search.

దీపావళి డేట్ మార్చిన ఏపీ.. ఎప్పుడంటే?

రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రోజు ముందుగా చేసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం క్యాలెండర్ లో పేర్కొన్నట్లుగా జరుపుకున్నారు.

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:32 AM GMT
దీపావళి డేట్ మార్చిన ఏపీ.. ఎప్పుడంటే?
X

మరే మతంలోని పండగులకు లేనంత కన్ఫ్యూజన్ హిందువులు జరుపుకునే పండుగలు.. పర్వదినాల విషయంలోతరచూ వివాదం చోటు చేసుకుంటోంది. పంచాంగం.. క్యాలెండర్ లో పేర్కొనే పండుగలకు భిన్నంగా.. తర్వాతి రోజుల్లో తేదీలు మార్చటం ఈ మధ్యన ఎక్కువైంది. దీనికి కారణం.. సూర్యోదయం వేళలో ఉండాలని కొందరుఅనుకోవటం.. మరికొందరు మిగులులో చేసుకోవటంతో.. ఈ తేడాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

మొన్నటికి మొన్న దసరా పండుగ విషయంలోనూ ఇలాంటి కన్ఫ్యూజన్ చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ రోజు ముందుగా చేసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం క్యాలెండర్ లో పేర్కొన్నట్లుగా జరుపుకున్నారు. మరో వారంలో వచ్చే దీపావళి విషయంలోనూ పంచాయితీ మొదలైంది. తాజాగా.. ఈ పండుగకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

క్యాలెండర్ లో పేర్కొన్న విధంగా చూస్తే.. నవంబరు 12న అంటే ఆదివారం దీపావళిగా తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసింది. చివర్లో ఏమైనా మార్పులు చేస్తుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. కారణం.. ఏపీలో దీపావళిని నవంబరు 12 నుంచి 13కుమారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకాలం 12ను సాధారణ సెలవుగా (నిజానికి ఆ రోజు ఆదివారం అనుకోండి) పేర్కొనగా.. తాజాగా మాత్రం తేదీలో మార్పు చేసింది.

పన్నెండుకు బదులుగా నవంబరు 13ను (సోమవారం) దీపావళి హాలిడేగా పేర్కొంది. అంతేకాదు.. సాధారణ సెలవులు.. ఆప్షనల్ సెలవుల జాబితాలోనూ మార్పులు చేసింది. నవంబరు 13ను ఆప్షన్ హాలీడేకు బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా పండుగ డేట్ మారుస్తుందా? లేదా క్యాలెండర్ లో పేర్కొన్నట్లుగా కంటిన్యూ చేస్తుందా? అన్నదిప్పుడు ఆసక్తికరప్రశ్నగా మారింది.