కోర్టు ఖర్చులు, అలిమొని కోసమే రుణాలు.. ఓ మ్యాగజిన్ సంచలన విషయాలు
భారతదేశం కుటుంబ వ్యవస్థపై ఆధారపడి నడుస్తుంది. అందుకే ఇక్కడి సంప్రదాయాలకు విలువ ఎక్కువగా ఉంటుంది.
By: Tupaki Desk | 1 Oct 2025 10:00 PM ISTభారతదేశం కుటుంబ వ్యవస్థపై ఆధారపడి నడుస్తుంది. అందుకే ఇక్కడి సంప్రదాయాలకు విలువ ఎక్కువగా ఉంటుంది. అయితే గత కొంత కాలంగా దేశంలో కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుందని తెలుస్తోంది. అందుకు కారణం వ్యక్తిగత స్వేచ్ఛ. మనకు ముందు కొన్ని జనరేషన్లు కుటుంబం కోసం వారి బాగోగుల కోసం కష్టపడేవారు. నేడు అది పూర్తిగా కనిపించడం లేదు. వ్యక్తిగత సుఖ సంతోషాలను మాత్రమే చూసుకుంటున్నారు. కుటుంబంలో భర్తను చంపివేస్తున్న భార్యలున్నారు. అయితే దీనిపై జరగుతున్న చర్చలో గతంను కలుపుతూ ఒకప్పుడు భార్యలను భర్తలు చంపేవారని కొందరు ఫెమినిస్టులు చెప్తున్నా.. పిల్లలను మాత్రం ఏ తండ్రి చంపలేదు. కానీ నేడు శారీరక సుఖం కోసం ముక్కు పచ్చలారని పిల్లలను కూడా కడతేస్తు్న్నారు. దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛ అనుకోవాలో లేక ఇంకేం అనుకోవాలో సమాజమే నిర్ణయిస్తుంది.
నలిగిపోతున్న పురుషులు..
అయితే, ఈ కుటుంబ బరువు భాద్యత ఎప్పుడూ ఇంటి యజమాని అయిన భర్తపైనే ఉంటుంది. ఇక్కడే మహిళలు తాము సంపాదిస్తున్నామని చెప్తున్నారు. వారు కోట్లు సంపాదించినా భర్త సంపాదించే కేవలం వేల రూపాయలపై కోర్టులకు ఎక్కుతున్నారు. చట్టాలు కూడా వారికి అనుకూలంగా ఉండడంతో మగవారి (భర్తల) పరిస్థితి మరింత దిగజారుతోంది.
సామాజిక సమస్యగా విడాకులు..
విడాకులు ఒక చిన్న సామాజిక సమస్యగా మారిపోయాయి. అయితే, గత కొన్ని సంవత్సరాలలో విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది సంఖ్యల్లో మాత్రమే కాదు.. దాని ప్రభావం వ్యక్తుల జీవితంపై తీవ్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎక్కువ ఇబ్బంది పడుతున్నవారు పురుషులే. సామాజిక అభిప్రాయంలో పురుషులు ఎప్పుడూ శక్తివంతులని, ఆర్థికంగా స్థిరంగా ఉన్నారని భావిస్తున్నారు. వాస్తవానికి, విడాకులు వారు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక ఒత్తిళ్లను ప్రతిబింబిస్తాయి.
పురుషులను కుంగదీస్తున్న ఖర్చులు..
ప్రస్తుతం దేశంలో లక్షలాది విడాకుల కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి కేసు కుటుంబం, వ్యక్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావం చేస్తుంది. వాస్తవ సమస్య ఏంటంటే, కోర్టు వ్యవస్థ చాలా మందిని నేరుగా మానసిక, ఆర్థిక ఒత్తిడిలోకి నెడుతుంది. శిక్షలు లేదా ఫీజుల భారం తడిసి మోపెడు అవుతుంది. భారత చట్టాల ప్రకారం.. ప్రతి సారి పురుషులే దీన్ని ఎదుర్కొంటున్నారు. అలిమొనీ, కోర్టు ఫీజులు, ఇతర ఖర్చులు వారిని ఆర్థికంగా మరింత ఒత్తిడిలోకి నెడుతున్నాయి.
42 శాతం పురుషులు రుణాలు తీసుకుంటున్నారు..
ఇంకా తీవ్రమైన అంశం ఏంటంటే.. ఈ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి పురుషులు రుణాలు తీసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయట. దేశంలో 42 శాతానికి పైగా పురుషులు కేవలం కోర్టు, అలిమొని, మెయింటెనెన్స్ కోసమే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారట. ఈ విషయాలను ఒక ప్రముఖ ఫైనాన్స్ మ్యాగజిన్ ప్రచురించింది. చిన్న చిన్న అప్పులు మొదలు పెట్టి, చివరకు పెద్ద రుణాలలో ఇరుక్కోవడం, వారి మానసిక శాంతిని మరింత దెబ్బతీస్తుందట. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు.. సమాజానికి ఒక హెచ్చరిక. మానసిక ఒత్తిడి, ఆర్థిక భారాలు, కుటుంబ సమస్యల సమీకరణ వారిని నరకంలోనే జీవించేటట్లు చేస్తుంది.
సమస్యను వేగంగా పరిష్కరించాలి..
సమాజం ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. విడాకుల కేసులను ఫాస్ట్-ట్రాక్ చేయడం, ఆర్థిక సాయం, మానసిక సలహా కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవడం సమాజ బాధ్యతగా నిలుస్తుంది. వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, వాళ్లకు అవసరమైన సాయం అందించడం అత్యంత కీలకం.
సమాజానికి అతిపెద్ద సమస్య..
విడాకులు కేవలం వ్యక్తి గతంగానే కాకుండా.. సమాజానికి పెద్ద సమస్యగా మారింది. పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలను అచేతనంగా నిర్లక్ష్యం చేయడం.. వారి భవిష్యత్తుకు పెద్ద ఆపదలను తెచ్చిపెడుతుంది. అందువల్ల, మనకు ఆలోచన అవసరం.. ఆర్థిక ఒత్తిడి, మానసిక బాధలు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని, ముందుకు రావాలి.
