Begin typing your search above and press return to search.

కొత్త వైరస్ "డిసీజ్ ఎక్స్"... 5 కోట్ల మంది చనిపోతారంట!

ఈ కొత్త వ్యాధికి "డిసీజ్ ఎక్స్" అని పేరు పెట్టారు. డబ్ల్యూ.హెచ్‌.ఓ అంచనాల ప్రకారం.. ఈ వ్యాధి కారణంగా సుమారు ఐదు కోట్ల మంది మరణించే అవకాశం ఉందట.

By:  Tupaki Desk   |   1 Oct 2023 2:30 AM GMT
కొత్త వైరస్ డిసీజ్  ఎక్స్... 5 కోట్ల మంది చనిపోతారంట!
X

కరోనా... ఈ పేరు చెబితే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా వణికిపోద్ది అన్నా అతిశయోక్తి కాదు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ వైరస్ ప్రపంచాన్ని వణికించేసింది. లక్షల కుటుంబాలు ఈ వైరస్ వల్ల రోడ్డున పడిపోయాయి. ఆ వైరస్ మిగిల్చిన గాయాలు ఇంకా మానలేదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా కంటే 7 రెట్లు ప్రమాదకరమైన మరోవైరస్ తో మానవాళికి పెను ముప్పు ఉందని చెబుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ)!

అవును... పేండమిక్ అని అంటే ప్రతి ఒక్కరి మనస్సులో మొదటిగా గుర్తు వచ్చేది కరోనా! ఇది ప్రపంచంలో అతిపెద్ద విధ్వంసానికి కారణమైంది. లక్షలాది మంది మరణానికి కారణమైంది. భయంతో చాలా చోట్ల లాక్‌ డౌన్‌ లాంటి పరిస్థితి ఏర్పడింది. 2020 సంవత్సరంలో సంభవించిన కరోనా మహమ్మారి ఇప్పటి వరకు అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధిగా రికార్డులకెక్కింది.

ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో కరోనా కంటే 7 రెట్లు ప్రమాదకరమైన అంటువ్యాధిని ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరోసారి అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ముప్పు పొంచి ఉందని చెప్తూ... దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఈ కొత్త వ్యాధికి "డిసీజ్ ఎక్స్" అని పేరు పెట్టారు. డబ్ల్యూ.హెచ్‌.ఓ అంచనాల ప్రకారం.. ఈ వ్యాధి కారణంగా సుమారు ఐదు కోట్ల మంది మరణించే అవకాశం ఉందట.

దాన్ని బట్టి ఈ అంటు వ్యాది తీవ్రత ఏ రేంజ్ లో ఉండొచ్చో అర్దం చేసుకోవచ్చు. కాగా... కోవిడ్-19 వంటి మహమ్మారి 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో సుమారు 70 లక్షల మంది మరణించారు. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రజలు ఇప్పటికీ ఈ మహమ్మారి ఎఫెక్ట్ ని చవి చూస్తున్నారని అంటున్నారు.

ఈ సమయంలో నిపుణులు కొత్త అంటువ్యాధి రాకగురించి చెబుతున్నారు. ఇది కోవిడ్ -19 కంటే ఏడు రెట్లు ఎక్కువ ప్రమాదకరం అని అంటున్నారు. ఈ కొత్త మహమ్మారి వల్ల దాదాపు 5 కోట్ల మంది చనిపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త మహమ్మారి 1918-1920లో వచ్చిన వినాశకరమైన స్పానిష్ ఫ్లూ అంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.