Begin typing your search above and press return to search.

మెహర్ రమేశ్​.. మళ్ళీ ఏదో చేస్తున్నట్లున్నాడే?

వివరాళ్లోకి వెళితే.. మెహర్ రమేశ్​.. ఈ పేరు వినగానే అభిమానులు భయపడుతుంటారు. నిర్మాతలు వెనక్కి తగ్గుతారు! అనే మాటలు వినిపిస్తుంటాయి

By:  Tupaki Desk   |   20 Oct 2023 12:30 PM GMT
మెహర్ రమేశ్​.. మళ్ళీ ఏదో చేస్తున్నట్లున్నాడే?
X

ఫ్లాప్​ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మెహర్ రమేశ్​.. రీసెంట్​గా మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమా చేసి మరో డిజాస్టర్​ను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఆయనపై ఉన్న కూస్తంత నమ్మకం కూడా అభిమానులకు పోయింది. అయితే ఇప్పుడాయన ఓ వెబ్​సిరీస్​ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

వివరాళ్లోకి వెళితే.. మెహర్ రమేశ్​.. ఈ పేరు వినగానే అభిమానులు భయపడుతుంటారు. నిర్మాతలు వెనక్కి తగ్గుతారు! అనే మాటలు వినిపిస్తుంటాయి. ఎందుకంటే ఈయన కెరీర్ గ్రాఫ్ అలా ఉంది మరి. స్టార్ హీరోలందరికీ కెరీర్​లోనే బిగ్గెస్ట్​ డిజాస్టర్లు ఇచ్చిన ట్రాక్ రికార్డ్​ ఈయనది! ఏ హీరోతో సినిమా చేసినా కూడా నెగిటివ్ రిజల్ట్ తప్ప పాజిటివ్ అనే పదమే ఈయనకు దాదాపుగా తెలియదనే చెప్పాలి. అన్ని చిత్రాలు దాదాపుగా దారుణంగా నిరాశ పరిచాయి.

ఎన్టీఆర్​కు కంత్రి, శక్తి.. ప్రభాస్​కు బిల్లా.. వెంకటేశ్​కు షాడో వంటి పెద్ద పెద్ద పరాజయాలను అందించారు మెహర్ రమేశ్. ఈ వరుస పరాజయాలతో దాదాపు పదేళ్ల పాటు మెగాఫోన్ కూడా పట్టలేదు. ఒక్క సినిమా డైరెక్ట్ చేయలేదు. అయితే ఈయన కెరీర్​లో కూడా రెండు పెద్ద హిట్లు ఉన్నాయి. అవి ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం కన్నడలో పునీత్ రాజ్​కుమార్​తో తీసినవి. ఈ రెండు తప్ప ఇప్పటివరకు ఆయనకు హిట్లే లేవు.

పదేళ్ల తర్వాత భోళాశంకర్​తో మెగాఫోన్​ పట్టిన ఆయన.. ఈ చిత్రంతో అయినా సక్సెస్​ రుచి చూస్తారనుకుంటే అది జరగలేదు. చిరుకు అతిపెద్ద డిజాస్టర్​ తగిలింది. దీంతో ఆయన మళ్లీ కొద్ది రోజుల నుంచి కనపడట్లేదు. అయితే తాజాగా ఇప్పుడాయన ఓ వెబ్ సీరీస్ చేసే ప్లాన్​లో ఉన్నారని తెలిసింది.

ఈ సారి కంప్లీట్ కమర్షియల్ యాంగిల్​కు భిన్నంగా చేస్తున్నారట. ఓ ఓటీటీ సంస్థతో చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ వెబ్​సిరీస్​తోనైనా ఆయన రాత మారుతుందా లేదా అనేది..