Begin typing your search above and press return to search.

సూరత్ లో డైమండ్ గణపతి... కోహినూర్ కంటే పెద్దది!

వినాయక నవరాత్రుల సందర్భంగా గణేషుడి భక్తులు వివిధ రూపాల్లో, వివిధ సైజుల్లో, విభిన్న శైలుల్లో ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Sep 2023 5:12 AM GMT
సూరత్ లో డైమండ్ గణపతి... కోహినూర్ కంటే పెద్దది!
X

వినాయక నవరాత్రుల సందర్భంగా గణేషుడి భక్తులు వివిధ రూపాల్లో, వివిధ సైజుల్లో, విభిన్న శైలుల్లో ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మట్టితో కొందరు, వెండితో మరికొందరు, బంగారంతో ఇంకొందరు.. ఎవరి స్థాయిలో వారు, వారి వారి అభిరుచుల మేరకు, ఆర్ధిక పరిస్థితుల మేరకు ఏర్పాటుచేసుకుంటున్నారు.

ఇదే సమయలో మండపాలను పత్రాలతో అలంకరించే వారు కొందరైతే, పుష్పాలతోనూ ఫలాలతోనూ అలంకరించేవారు ఇంకొందరు. అదేవిధంగా... కరెన్సీ నోటులతో అలంకరించేవారు మరికొందరు. ఈ సమయంలో ఏకంగా డైమండ్ గణపతి వెలుగులోకి వచ్చారు. దాని ధర ఎంత, ఇతర విశేషాలేమిటి అనేవి ఇప్పుడు చూద్దాం.

గుజరాత్‌ లోని సూరత్‌ లో వజ్రాల వ్యాపారి కనుభాయ్‌ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. ఇందులో భాగంగా... 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న డైమండ్ గణేష్ ని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు. ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులకు కూడా అనుమతిస్తారు. ఈ వజ్రం ధర గురించి అధికారికంగా వెల్లడించకపోయినా.. మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

ఇక సైజులో కోహినూర్‌ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు. పదిహేనేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్‌ అక్కడి నుంచి ముడి వజ్రాలను భారత్‌ కు తీసుకొచ్చారట. అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లు కనుభాయ్ తండ్రికి కల వచ్చిందట. దీంతో అన్నీ చెక్ చేస్తే... ఒక వజ్రం వినాయకుడి ఆకారంలో ఉందట. అప్పటి నుంచి ఈ వజ్ర గణపతికి అ కుటుంబం పూజలు చేస్తోందని చెబుతున్నారు!