Begin typing your search above and press return to search.

రిపోర్టర్ పై శిఖర్ ధావన్ కి అంత కోపం ఎందుకంటే.. వీడియో వైరల్!

అలాంటి ధావన్ ను... ఒకవేళ పాకిస్థాన్ సెమీస్ కు వస్తే మీ వైఖరి మార్చుకుంటారు అని విలేకరి ప్రశ్నించాడు. దీనిపై శిఖర్ మండిపడ్డారు.

By:  Tupaki Desk   |   28 July 2025 12:52 AM IST
రిపోర్టర్ పై శిఖర్ ధావన్ కి అంత కోపం ఎందుకంటే.. వీడియో వైరల్!
X

తాజాగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌ లెజెండ్స్ టోర్నీలో పాక్‌ ఛాంపియన్స్‌ తో భారత్‌ ఛాంపియన్స్ ఆడకపోవడంతో రద్దైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఈ టోర్నీలో సెమీఫైనల్లో భారత్ - పాకిస్థాన్‌ తో తలపడితే.. శిఖర్ ధావన్ ఆడతాడా అని ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనిపై ధావన్ మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... గతంలో పాకిస్తాన్‌ తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ నుండి యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్‌ లతో పాటు శిఖర్ ధావన్ కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే! అలాంటి ధావన్ ను... ఒకవేళ పాకిస్థాన్ సెమీస్ కు వస్తే మీ వైఖరి మార్చుకుంటారు అని విలేకరి ప్రశ్నించాడు. దీనిపై శిఖర్ మండిపడ్డారు.

ఈ సందర్భంగా స్పందించిన ధావన్... "మీరు ఈ ప్రశ్నను రాంగ్ టైమ్ లో, రాంగ్ ప్లేస్ లో అడుగుతున్నారు.. మీరు దీన్ని అడగకూడదు.. నేను ఇంతకు ముందు ఆడలేదు కాబట్టి, ఇప్పుడు కూడా ఆడను" అని ధావన్ సంభాషణలో తీవ్రంగా అన్నాడు. ఈ సందర్భంగా వైరల్ అవుతున్న వీడియోలో ధావన్ స్పష్టమైన సమాధానానికి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

మరోవైపు... ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... లీగ్‌ దశలో భారత్, పాకిస్థాన్‌ రెండుసార్లు తలపడనున్నాయి. ఇందులో భాగంగా... సెప్టెంబరు 14, 21 తేదీల్లో.. ఆదివారాల్లో ఈ మ్యాచ్‌ లు జరుగుతాయి. ఈ మ్యాచ్ లు యూఏఈ వేదికగానే జరగనున్నాయి. ఇప్పుడిదే బీసీసీఐపై అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

ఈ సందర్భంగా... పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాక్‌ తో భారత్ క్రికెట్‌ ఆడకూడదని మాజీలు, అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌ లెజెండ్స్ టోర్నీలోనూ పాక్‌ ఛాంపియన్స్‌ తో భారత్‌ ఛాంపియన్స్ ఆడకపోవడంతో రద్దైంన నేపథ్యంలో... ఆసియా కప్‌ లో మాత్రం భారత్ - పాక్‌ మ్యాచ్‌ లు నిర్వహించాలనుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఇందులో భగంగా... ఆసియా కప్ లో భాగంగా... సెప్టెంబర్ 14 ఆదివారం రోజున భారత్ - పాక్‌ మ్యాచ్ జరగనుంది.. పరోక్షంగా పీసీబీకి ఫండింగ్‌ చేయడమే అవుతుంది.. వారు దానిని తిరిగి మనమీదనే ఉపయోగిస్తారు' అని ఒకరంటే... 'భారత ఆర్మీ పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఆసియా కప్‌ లో పాక్‌ తో మ్యాచ్‌ లు ఆడొద్దు' అని మరొకరు స్పందించారు.