ధర్మేంద్ర ప్రధాన్ అవుట్...ఆమెకి ఆ కీలక శాఖ ?
ఇక ధర్మేంద్ర ప్రధాని చేతిలో ఉన్న విద్యా శాఖను కేంద్ర ఆర్ధిక మంత్రిగా రికార్డు స్థాయిలో వరసగా తొమ్మిది బడ్జెట్లను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కి అప్పగిస్తారు అని అంటున్నారు. ఆమె ఉన్నత విద్యావంతురాలిగా ఉన్నారు.
By: Satya P | 8 Jun 2026 9:41 AM ISTఈ రోజున బొద్దింకల పార్టీ జంతర్ మంతర్ వద్ద ఫైర్ అవుతోంది అంటే దానికి కారణం నీట్ పేపర్ లీకేజ్. దాంతో పాటుగా సీబీఎస్ఈ వివాదం కూడా ఆయన్ని వెంటాడుతోంది. అలాగే విద్యా శాఖలో గత కొంత కాలంగా ఉదాశీనత నిర్లక్ష్యం వంటివి. ఈ పరిణామాలతో పాటు కాక్రోచ్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ ని విద్యా శాఖ నుంచి తప్పుకోమని డిమాండ్ చేస్తోంది. అఫ్ కోర్స్ వారు అడిగారని ఆయనని తప్పించేది ఉండదు. అదే సమయంలో కాక్రోచ్ పార్టీ కాదు జనాలలో ఉన్న ఆలోచనలు కూడా బీజేపీ పసిగట్టగలదు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ కి పక్కన పెట్టడం ఖాయం అని అంటున్నారు.
ఆమెకు ఆ బాధ్యతలు :
ఇక ధర్మేంద్ర ప్రధాని చేతిలో ఉన్న విద్యా శాఖను కేంద్ర ఆర్ధిక మంత్రిగా రికార్డు స్థాయిలో వరసగా తొమ్మిది బడ్జెట్లను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కి అప్పగిస్తారు అని అంటున్నారు. ఆమె ఉన్నత విద్యావంతురాలిగా ఉన్నారు. పైగా తనకు అప్పగించిన శాఖలను సమర్ధంగా నిర్వహిస్తారు అన్న పేరుంది. మోడీ అమిత్ షా టీం కి ఆమె పట్ల గురి ఉంది. పైగా ఆమెకి ఈ కీలకమైన విద్యా శాఖను అప్పగించడం ద్వారా కాక్రోచ్ పార్టీకి చెక్ పెట్టేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు.
ఆయనకు ఆర్ధిక శాఖ :
అదే సమయంలో నిర్మలా సీతారామన్ చేతిలో ఉన్న ఆర్ధిక శాఖ ఎవరికి అన్న చర్చ వస్తోంది. అయితే ఈ శాఖకు ఇప్పటిదాకా వాణిజ్య పనులు పరిశ్రమల శాఖను చూస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఉన్నత విద్యావంతుడు మంత్రిగా మంచి మార్కులు సంపాదించుకున్న పీయూష్ గోయెల్ కి అప్పగిస్తారు అని అంటున్నారు. ఆయన అయితేనే ఈ భారాన్ని మోయగలరని కూడా అంటున్నారు. పైగా ఆయన ఆర్ధిక శాఖని చక్కగా నిర్వహిస్తారు అని మోడీ షా నమ్ముతున్నారు.
రైల్వేస్ నుంచి షిఫ్ట్ :
ఇక రైల్వే మంత్రిగా ఉన్న ఒడిషాకు చెందిన అశ్విని వైష్ణవ్ కి వాణిజ్య పరిశ్రమల శాఖను అప్పగిస్తారు అని అంటున్నారు. ఆ విధంగా పీయూష్ గోయెల్ నిర్వహించిన బాధ్యతలలో ఆయన కూడా తన సత్తా చాటుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు అని అంటున్నారు. రైవే శాఖకు నితీష్ కుమార్ కి అప్పగించవచ్చు అన్న ప్రచారం కూడా సాగుతోంది. ఆయన గతంలో కూడా ఈ శాఖను చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు అని గుర్తు చేస్తున్నారు.
ఎన్నికల టీం కోసమే :
ఇదిలా ఉంటే ఈ నెల 10న ఎన్డీయే కీలక సమావేశం ఢిల్లీలో జరగనుంది. దీనిని ఎన్డీయే మిత్రులు అంతా హాజరవుతున్నారు. ఏపీ నుంచి టీడీపీ తరఫున చంద్రబాబు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళనున్నారు. రెండేళ్ళ ఎన్ డీయే పాలన మీద సమీక్ష చేయడమే కాకుండా కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ మీద కూడా చరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా ఎన్నికల టీం గా సమర్ధత పనితీరు కొలమానంగా కొత్త మంత్రులను ఎంపిక చేస్తారని దాని మీద కూడా చర్చ సాగుతుందని అంటున్నారు. ఇక కేబినెట్ విస్తరణ కానీ పునర్ వ్యవస్థీకరణ కానీ ఈ నెల 20న జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆ రోజుని మంచి ముహూర్తంగా ఎంచుకున్నారని చెబుతున్నారు. చూడాలి మరి ఎవరెవరికి చోటు దక్కుతుందో ఎవరు అవుట్ అవుతారో.
