మా డాడీ ఫైర్ బ్రాండ్...బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ !
ధర్మపురి అరవింద్. ఈ పేరు తెలంగాణా రాజకీయాలకు ఇపుడు సుపరిచితం. ఆయన గురించి తొలిగా తెలిసింది.
By: Satya P | 24 May 2026 12:23 PM ISTధర్మపురి అరవింద్. ఈ పేరు తెలంగాణా రాజకీయాలకు ఇపుడు సుపరిచితం. ఆయన గురించి తొలిగా తెలిసింది. 2019 ఎన్నికల్లో అప్పటి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె సిట్టింగ్ ఎంపీ కవితను నిజమాబాద్ లో ఓడించి ఎంపీ కావడంతో అంతా ఎవరీయన అని ఆశ్చర్యపోయారు. అందులోనూ బీజేపీ నుంచి పోటీకి దిగి తెలంగాణాలో జెండా పాతడం, అది కూడా బీఆర్ఎస్ వరసగా రెండోసారి రాష్ట్రంలో గెలిచి తిరుగులేని స్థితిలో ఒక బలమైన ప్రాంతీయ పక్షంగా ఉన్న సందర్భంలో ఎదురు నిలిచి సీఎం కుమార్తె మీదనే గెలిచిన అరవింద్ ని అంతా రాజకీయ మొనగాడుగానే చూశారు. ఇక మొదటి సారి గెలుపు జాక్ పాట్ అనుకుంటే వరుసగా రెండోసారి 2023 లో కూడా అదే సీటు నుంచి పోటీ చేసి గెలిచిన అరవింద్ ని చూసిన వారు ఈయన సీరియస్ పొలిటీషియన్ అని నిర్ధారణకు వచ్చారు.
డైనమిక్ లీడర్ గా :
అంతే కాదు నిజమాబాద్ లో పట్టు సాధించి పాగా వేసేసారు అని కూడా డిసైడ్ అయిపోయారు. ఇలా రెండోసారి గెలవడమే కాకుండా తనదైన స్టైల్ లో రాజకీయం చేస్తూ దూకుడుగా ముందుకు సాగుతున్న ధర్మపురి అరవింద్ ఇపుడు కేంద్ర మంత్రి రేసులో కూడా ఉన్నారు. ఇంతకీ ఈ ధర్మపురి అరవింద్ కి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉంది. తండ్రి దిగ్గజ కాంగ్రెస్ నేత ఒకనాటి ఉమ్మడి ఏపీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు అన్నది చాలా మందికి తెలుసో తెలియదో కానీ అరవింద్ మాత్రం కేరాఫ్ అడ్రస్ తో రాజకీయాల్లోకి రాలేదు అన్నది ఆయన ఎంచుకున్న పార్టీ ఆయన తీసుకునే నిర్ణయాలు చేసే ప్రకటనల బట్టి అర్ధం అవుతోంది.
డీఎస్ లోనూ ఫైర్ ఉంది :
ఈ మాట వినడానికి కొత్తగా ఉంటుంది. ఎందుకంటే డీ శ్రీనివాస్ ఉమ్మడి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉన్నపుడు ఎంతో సౌమ్యంగా సాఫ్ట్ గా కనిపించేవారు. అంతే కాదు ఆయన రాజకీయ వ్యూహ రచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మాటల కంటే చేతలలోనే తన సత్తా చూపించేవారు అని అనుకుంటారు. ఇదే ప్రశ్నను ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్ ఇంటర్వ్యూ సందర్భంగా ధర్మపురి అరవింద్ ని అడిగినపుడు మీరు చూసిన డీ శ్రీనివాస్ వేరు అని చెప్పడం ద్వారా షాక్ ఇచ్చారు. మా డాడీ ఫైర్ బ్రాండ్ అన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని ఫ్లాష్ బ్యాక్ చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ మంత్రి వర్గంలోనూ తనకు నచ్చని విషయాలు ఉంటే కేబినెట్ నుంచి ఆవేశంగా బయటకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని గతాన్ని రివీల్ చేశారు. విజయభాస్కరరెడ్డి సీఎం గా ఉండగా డీఎస్ మంత్రిగా చేసినపుడు తనకు నచ్చని వ్యవహారాల మీద ఏకంగా కేబినెట్ నుంచే బాయ్ కాట్ చేసి డీఎస్ బయటకు వచ్చారని కుమారుడు అరవింద్ చెబుతూంటే అవునా నిజమేనా అని ఈ తరానికి అనిపించక మానదు. అంతలా డీఎస్ దూకుడు రాజకీయాలు చేసేవారు కాబట్టే కాంగ్రెస్ లో నిలదొక్కుకున్నారు అని అనుకోవాల్సి కూడా ఉంది.
స్పోర్ట్స్ మాన్ నేచర్ :
తాను స్పోర్ట్స్ మాన్ అని బీజేపీ ఎంపీ అరవింద్ తన గురించి జనాలకు అంతగా తెలియని మరో విషయం చెప్పారు. తాను క్రికెట్ ఆటగాడిని అని రంజీ ట్రొఫీ దాకా ఆడాను అని చెప్పారు. తనలో ఈ దూకుడు స్పీడ్ ఫైర్ అంతా స్పోర్ట్స్ నుంచి వచ్చినదే అని చెప్పుకున్నారు తాను ఓపెన్ మైండ్ తో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాను అని కూడా ఆయన చెప్పారు. బాల్ వేశామంటే వికెట్ అయినా పడాలి లేదా మూతి అయినా పగలాలి ఇదే క్రికెటర్ నైజం అన్నారు. తాను బాట్స్ మాన్ ని ఓపెనింగ్ బాట్స్ మాన్ గా తన క్రికెట్ ప్రస్థానం సాగిందని అన్నారు.
బీజేపీలో స్పీడ్ :
ధర్మపురి అరవింద్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు. సంచలనానికి ఎపుడూ తెర తీస్తూ ఉంటారు. ఆయన జోరు స్పీడ్ బీజేపీకి ఇపుడు అవసరం అని భావిస్తున్నారు. బలమైన సామాజిక వర్గం నేపథ్యం, అలాగే ఎంతో ప్రతిష్ట కలిగిన రాజకీయ కుటుంబ నేపథ్యం, అరవింద్ ఓపెన్ మైండ్ తో చేసే పాలిటిక్స్ ఇవన్నీ కూడా బీజేపీకి అవసరమని భావించిన పక్షంలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు. మరి కొద్ది రోజులలో ఆయన రాజకీయ దశ ఏమిటి అన్నది తెలుస్తుందని అంటున్నారు.
