Begin typing your search above and press return to search.

కడప సుబ్బారెడ్డి కబ్జా చేస్తాడంట.., మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్...!

ఎక్కడ నుంచో శ్రీకాకుళానికి ఎందుకు వస్తున్నారు. ఇక్కడ భూములు ఈ అబ్బ సొత్తా అని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు

By:  Tupaki Desk   |   26 Feb 2024 9:52 AM GMT
కడప సుబ్బారెడ్డి కబ్జా చేస్తాడంట.., మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్...!
X

ఎవరో సుబ్బారెడ్డిట. కడప నుంచి వచ్చాడుట. ఇక్కడ భూముల మీద కన్నేశాడు నేను అడ్డుకున్నాను అంటూ వైసీపీలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. శ్రీకాకుళం పీఎస్ కాలనీలోని కళింగ కోమటి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు రౌడీలు భూకబ్జాదారుల వల్ల ప్రశాంతమైన పట్టణాలు పూర్తిగా కలుషితమై పోతాయని అన్నారు.

ఎక్కడ నుంచో శ్రీకాకుళానికి ఎందుకు వస్తున్నారు. ఇక్కడ భూములు ఈ అబ్బ సొత్తా అని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఒక నాయకుడిగా ఉన్నంతవరకూ భూములను కబ్జా కానీయను అని ఆయన అన్నారు. అలా జరిగిన నాడు తనకే అవమానం అని ఆయన చెప్పారు.

శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు సైతం కబ్జాదారులు వస్తున్నారని వారి చేతుల్లోకి భూములు వెళ్తే ఇక అరాచకమే ఎక్కడ చూసినా ఉంటుందని ధర్మాన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా వచ్చిన వారి వెనకాల రౌడీలు ఉంటారని వారి మీద మరో పెద్ద రౌడీలు ఉంటారని ఇలా వీరంతా వచ్చి ఊళ్లకు ఊళ్ళు దోచేస్తే మన గతి ఏంటి అని ఆయన ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్నో వనరులు ఉన్నాయని వాటిని దోచుకోవడానికే కొందరు ఇటు వైపు వస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. భూములు కొట్టేసేవారు, వనరులు దోచుకున్న వారు ఏ పార్టీకి చెందిన వారు అయినా తాను గట్టిగా అడ్డుకుంటాను అని ఆయన స్పష్టం చేశారు.

ఇలా వదిలేస్తే మాత్రం ఈ ప్రాంతాలు అన్నీ రౌడీల మయం అవుతాయని ఆయన హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు అయిన వారు అవినీతికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు ఎవరో భూములను అన్యాయంగా తీసుకునే మనస్తత్వం ఉండరాదు అని ఆయన హితవు పలికారు.

ఇలాంటి పనులు ఎవరు చేయాలనుకున్నా తాను అసలు సహించేది లేదని ధర్మాన స్పష్టంగా చెప్పారు. తాను శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేశానని ఆయన చెప్పారు. తన కంటే ఎవరూ కూడా అభివృద్ధి చేయలేదని ఆయన చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే ధర్మాన చేసిన ఈ కామెంట్స్ ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఎవరీ సుబ్బారెడ్డి ఆయన వెనక ఉన్నది ఎవరు అన్నది చర్చించుకుంటున్నారు.

తాను పార్టీలు చూడను ఎవరైనా ఇలాగే అంటూ ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటిదాకా అయితే విపక్ష తెలుగుదేశం పార్టీ ఇతర ప్రతిపక్షాలు ఉత్తరాంధ్రా భూములను దోచుకుంటున్నారు అని విమర్శలు చేస్తూ వచ్చారు. అవన్నీ వైసీపీ నేతల మీదనే చేశారు.

అయితే ఇపుడు వైసీపీ ప్రభుత్వంలో సాక్ష్తాత్తూ రెవిన్యూ మంత్రిగా ఉన్న ధర్మనా నోటి వెంటనే ఇలాంటి కామెంట్స్ రావడంతో ఆయన ఎవరిని విమర్శిస్తూ చేశారు అన్నది రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది. కడప అంటున్నారు సుబ్బారెడ్డి అని చెబుతున్నారు అంటే ఆ పార్టీ ఏదై ఉంటుందన్నది రకరకాలుగా చర్చిస్తున్నారు. మొత్తానికి వైసీపీ ప్రభుత్వ మంత్రిగా ధర్మాన బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.