Begin typing your search above and press return to search.

ధర్మాన రివర్స్ గేర్ స్పీచ్!

ఓట్లు అడగను, మీకు నా పనితీరు నేను ఇష్టం ఉంటే ఓట్లు వేయండి అంటూ రివర్స్ గేర్ లో వెళ్తున్నారు వైసీపీ సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు

By:  Tupaki Desk   |   11 Nov 2023 2:30 AM GMT
ధర్మాన రివర్స్ గేర్ స్పీచ్!
X

ఓట్లు అడగను, మీకు నా పనితీరు నేను ఇష్టం ఉంటే ఓట్లు వేయండి అంటూ రివర్స్ గేర్ లో వెళ్తున్నారు వైసీపీ సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళంలోని పెదపాడు అనే గ్రామంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

నేను ఓట్లు అడగడానికి పెదపాడుకు రాలేదు అని మంత్రి చెప్పేశారు. అలా అని నా పనులు నేను ఆపేది లేదు. మే నెల వరకూ మంత్రిగా ఉంటాను. ఏ పని అయినా నేనే చేస్తాను. నేను మళ్లీ కావాలన్నా మంత్రిగా రావాలన్నా ఓటు వేయండి. అలా కాదు టీడీపీకే ఓటేస్తే మాత్రం వచ్చే జూన్ నుంచి వాలంటీర్ మీ దగ్గరకు రాడు, పించను కూడా మీకు రాదు అని ధర్మాన భవిష్యత్తు గురించి జనాలకు వివరించారు.

ఎన్నికలు వస్తున్నాయని తెలిసీ తెలియని పనులు చేస్తే ఇబ్బందులు మీరే పడతారు అని ధర్మాన హెచ్చరించారు. ఎన్టీయార్ క్రిష్ణుడి వేషం వేశారని మీరు ఆయన పార్టీకి ఓట్లేస్తే నష్టపోతారని మంత్రి అంటున్నారు. అన్ని కులాలకు న్యాయం చేసింది వైసీపీ అని ఆయన స్పష్టం చేస్తున్నారు.

ఇంకా ఎన్టీయార్ పార్టీలో ఉన్నారని భ్రమిస్తే ఆ భ్రమల నుంచి బయటకు రావాలని ధర్మాన కోరారు. ఎన్టీయార్ పెట్టిన టీడీపీ ఇది కాదని, ఇపుడు ఎన్టీయార్ కూడా లేరని అన్ని విషయాలు గ్రహించాలని మంత్రి హిత బోధ చేస్తున్నారు.

తాను అన్ని కులాలకు అవకాశాలు ఇచ్చానని టీడీపీ వారు పట్టించుకున్నారా అని ధర్మాన ప్రశ్నించారు. ధర్మాన ఓట్లు అడగను మీరే ఆలోచించుకోండి అంటూ రివర్స్ లో మాట్లాడడం మాత్రం జనాలలో డిస్కషన్ గా మారుతోంది. టీడీపీకి ఓటేసే పనులు వద్దు అని అంటున్నారు. జనాలు ఏమి ఆలోచించుకుంటారో.