Begin typing your search above and press return to search.

మన సినిమా చిట్టి మాదిరి.. ఆ ఐటీ కంపెనీకి ‘డెవిన్’

అమెరికాకు చెందిన కాగ్నిషన్ సంస్థ క్రియేట్ చేసిన ఈ ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు "డెవిన్" అన్న పేరును పెట్టేశారు.

By:  Tupaki Desk   |   14 March 2024 10:30 AM GMT
మన సినిమా చిట్టి మాదిరి.. ఆ ఐటీ కంపెనీకి ‘డెవిన్’
X

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంతో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ డూపర్ చిత్రంలో చిట్టి రోబోను చూశాం. నిజమేనా? ఇలాంటివి సాధ్యమా? అన్న దానిపై అప్పట్లో జోరైన చర్చ జరిగింది. కట్ చేస్తే.. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అప్డేడ్ అయిన ఏఐ పుణ్యమా అని ప్రపంచం విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి.

తాజాగా ఒక ప్రముఖ ఐటీ కంపెనీ సైతం మన మూవీ చిట్టి తరహాలో ఒక రోబోను తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏమంటే.. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.

అమెరికాకు చెందిన కాగ్నిషన్ సంస్థ క్రియేట్ చేసిన ఈ ఏఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు "డెవిన్" అన్న పేరును పెట్టేశారు. అత్యంత క్లిష్టమైన అంశాలతో కూడిన పనుల్ని ఈ డెవిన్ ఇట్టే పూర్తి చేస్తున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది. ఈ ఏఐ ఐటీ ఇంజినీర్ కొత్త విషయాల్ని నేర్చుకునే సత్తా ఉండటం మరో ప్రత్యేకత. అంతేకాదు.. తప్పుల్ని సైతం గుర్తిస్తుంది. దాన్ని సవరించే సామర్థ్యం దీని సొంతం.

ఒక సాఫ్ట్ వేర్ నిపుణుడు చేసే అన్ని పనుల్ని నిర్వర్తించే విధంగా ఇందులో పలు టూల్స్ ను నిక్షిప్తం చేవారు. తన యూజర్ తో కలిసి పని చేసే సామర్థ్యాన్ని దీనికి కల్పించినట్లుగా సంస్థ చెబుతోంది. తాను చేసిన పనిలోని ప్రగతిని డెవిన్ ఎప్పటికప్పుడు తెలియజేయటమే కాదు.. తన పని తీరును మెరుగుపర్చుకోవటానికి ప్రయత్నిస్తుంటుంది.

అంతేకాదు.. వెబ్ సైట్లు.. సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లకు అవసరమైన కోడ్ లను డెవిన్ ఇట్టే రాసేస్తుందని చెబుతున్నారు.మొత్తంగా అద్భుతం అన్న పదానికి నిలువెత్తు రూపంగా దీన్ని చెప్పొచ్చు.