Begin typing your search above and press return to search.

దేవినేని ఉమా కుమారుడి పెళ్లి వేడుకలో రేవంత్, లోకేష్ ఆత్మీయ కలయిక!

ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ, న్యాయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   30 April 2025 1:33 PM IST
దేవినేని ఉమా కుమారుడి పెళ్లి వేడుకలో రేవంత్, లోకేష్ ఆత్మీయ కలయిక!
X

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు దేవినేని చందు వివాహం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయంగా భిన్న ధ్రువాలుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై కలుసుకోవడం, ఆత్మీయంగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ, న్యాయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రంగాల ప్రముఖులు నూతన దంపతులను ఆశీర్వదించారు.

దేవినేని ఉమా తనయుడి వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్‌తో ఆయన కాసేపు ముచ్చటించారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

దేవినేని ఉమా, రేవంత్ రెడ్డి గతంలో ఒకే పార్టీలో పనిచేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలో వీరిద్దరూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ అనుబంధంతోనే రేవంత్ రెడ్డి ఈ వివాహ వేడుకకు హాజరయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.