Begin typing your search above and press return to search.

మహా సీఎం ఫడ్నవీస్‌ సీటుకు ఎసరు...ఫైర్ బ్రాండ్ ఎంపీ జోస్యం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీటుకి ఎసరు వస్తోందా. ఆయనకు స్థాన చలనం కలుగుతోందా అంటే అవును అంటున్నారు ఫైర్ బ్రాండ్ ఎంపీ ఒకరు.

By:  Satya P   |   18 July 2026 8:30 AM IST
మహా సీఎం ఫడ్నవీస్‌ సీటుకు ఎసరు...ఫైర్ బ్రాండ్ ఎంపీ జోస్యం
X

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీటుకి ఎసరు వస్తోందా. ఆయనకు స్థాన చలనం కలుగుతోందా అంటే అవును అంటున్నారు ఫైర్ బ్రాండ్ ఎంపీ ఒకరు. అయితే ఆయన బీజేపీకి మిత్రుడు కాదు, ప్రత్యర్ధి. పైగా దేవేంద్ర ఫడ్నవీస్ మీద నిత్యం విమర్శలు చేసేవారు. అయినప్పటికీ ఆయన తాజాగా పేల్చిన పొలిటికల్ బాంబ్ అయితే ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే తొందర్లోనే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోతున్నారు అని. ఇది నిజంగా జాతీయ రాజకీయాల్లో చర్చకు తావించే వార్తగానే చూడాల్సి ఉంది.

బీజేపీకి స్ట్రాంగ్ లీడర్ గా :

మహారాష్ట్రలో బీజేపీకి స్ట్రాంగ్ లీడర్ గా దేవేంద్ర ఫడ్నవీస్ ని చెప్పుకుంటారు. ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే బీజేపీ సొంతంగా 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ళ పాటు అధికారం అందుకుంది. అలా కేవలం 44 ఏళ్ళ వయసులోనే మహారాష్ట్రకు సీఎం గా పనిచేశారు. ఇక 2024 నుంచి రెండోసారి సీఎం గా వ్యవహరిస్తున్నారు. ఆయన మరో మూడేళ్ళ పాటు ఇదే పదవిలో కొనసాగే అవకాశం ఉంది. పార్టీ మీద పూర్తి పట్టు ఉంది. అలాంటి ఆయనను ఎందుకు సీఎం పోస్టు నుంచి కదల్చివేస్తారు అన్నదే ప్రశ్న. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నది కూడా ఉంది కాబట్టి ఫైర్ బ్రాండ్ ఎంపీ పేల్చిన బాంబు మీద అంతటా చర్చ సాగుతోంది.

కేంద్రంలో మంత్రిగా :

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలోనే కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణ జరపనుంది. అందులో భారీగానే మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు. కేంద్ర మంత్రులు పలువురిని గవర్నర్లుగా అలాగే పార్టీ బాధ్యులుగా బీజేపీ పంపబోతోంది. అలాగే కొందరు ముఖ్యమంత్రులని కేంద్రానికి తీసుకుని వస్తుందని అంటున్నారు. మరి ఈ జాబితాలో మహా సీఎం ఉన్నారా అంటే శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ ఎంపీ సంజయ్ రౌత్ ఇదే నిజం అని అంటున్నారు. అంతే కాదు దేవేంద్ర ఫడ్నవీస్ ప్లేస్ లో బీజేపీకి చెందిన మరో నేత ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన చెబుతున్నారు.

షిండేతో పడడం లేదు :

ఇక చూస్తే మహా రాజకీయాలు చాలా సంక్లిష్టమైనవి. అక్కడ దిగ్గజ నేత మాజీ సీఎం శరద్ పవార్ ఎన్సీపీతో ఉన్నారు. అలాగే మరో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా ఉన్నారు. ఇక ఏక్ నాధ్ షిండే శివసేనను చీల్చి మరీ మాస్ లీడర్ గా ఉన్నారు. ఆయన 2022 నుంచి 2024 దాకా రెండేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా బీజేపీ మద్దతుతో పనిచేశారు. 2024లో కూడా తనకే చాన్స్ ఇస్తారు అని అనుకున్నారు కానీ అది జరగలేదు, పైగా ఆయనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి పడదు అన్న ప్రచారం ఉంది. సరైన శాఖలు తనకు దక్కలేదని కూడా ఆయనలో ఆవేదన ఉంది అని అంటున్నారు. ఇక బీజేపీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మహారాష్ట్రలో బీజేపీ మరింతగా పటిష్టం కావలని దాంతో పాటు మిత్రులను కూడా దగ్గరకు తీసుకోవాలని చూస్తోంది. షిండేలోని అసంతృప్తిని పసిగట్టిన బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ని ఏకంగా కేంద్ర రాజకీయాల్లోకి తీసుకుని వెళ్ళి అందరికీ ఆమోదయోగ్యమైన వారికి ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.