Begin typing your search above and press return to search.

భట్టికి రెవెన్యూ.. ఉత్తంకి హోం.. మంత్రులకు కేటాయించిన శాఖలివే!

మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బీఆరెస్స్ ప్రభుత్వంలో కేటీఆర్ నిర్వహించిన శాఖలను కేటాయిస్తూ నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 12:06 PM
భట్టికి రెవెన్యూ.. ఉత్తంకి హోం.. మంత్రులకు కేటాయించిన శాఖలివే!
X

తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయింపు పూర్తయింది. ఇందులో భాగంగా... డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క కీలకమైన రెవిన్యూ శాఖను పర్యవేక్షించనున్నారు. ఇదే సమయంలో సీఎం పదవి కోసం చివరి వరకు రేసులో నిలిచిన ఉత్తం కుమార్ రెడ్డికి హోం శాఖ ఖరారు చేసారు. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బీఆరెస్స్ ప్రభుత్వంలో కేటీఆర్ నిర్వహించిన శాఖలను కేటాయిస్తూ నిర్ణయించారు.

ఇదే సమయంలో దామోదర రాజనర్సింహకు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. సీనియర్ నేత కావటంతో కీలకమైన ఈ శాఖను అప్పగించారని తెలుస్తుంది. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావుకు రోడ్లు, భవనాల శాఖ ఖరారైంది. ఈయన గతంలోనూ ఈ శాఖను నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇరిగేషన్ శాఖను ఖరారు చేసారు.

ఇదే క్రమంలో... శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖతో పాటుగా అసెంబ్లీ వ్యవహారాలను ఖరారు చేస్తూ నిర్ణయించారు. జూపల్లి కృష్ణారావుకి పౌర సరఫరాలను కేటాయించారు. ఈ క్రమంలో తొలిసారి మంత్రి అయిన సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ ఖరారు అవ్వగా.. పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమశాఖ.. కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఖరారైంది.

ముఖ్యమంత్రి – రేవంత్ రెడ్డి

డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి - భట్టి విక్రమార్క

హోం మంత్రి- ఉత్తం కుమార్‌ రెడ్డి

ఆర్థికశాఖ మంత్రి - డి. శ్రీధర్‌ బాబు

మున్సిపల్‌ శాఖ మంత్రి - కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

నీటి పారుదలశాఖ మంత్రి - పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి - దామోదర రాజనర్సింహ

పౌరసరఫరాలశాఖ మంత్రి - జూపల్లి కృష్ణారావు

రోడ్లు, భవనాల శాఖ మంత్రి - తుమ్మల నాగేశ్వరరావు

మహిళా సంక్షేమశాఖ మంత్రి - కొండా సురేఖ

బీసీ సంక్షేమశాఖ మంత్రి - పొన్నం ప్రభాకర్‌

గిరిజన సంక్షేమశాఖ మంత్రి - సీతక్క