Begin typing your search above and press return to search.

కొత్త ఏడాది వేళ.. సింహానాన్ని వదిలేస్తున్నట్లుగా షాకిచ్చిన ఆ దేశ రాణి

అదే సమయంలో తన వారసుడ్ని ఆమె ప్రకటించారు. తన పెద్ద కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ రాజుగా పగ్గాలు చేపడతారని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 6:50 AM GMT
కొత్త ఏడాది వేళ.. సింహానాన్ని వదిలేస్తున్నట్లుగా షాకిచ్చిన ఆ దేశ రాణి
X

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన డెన్మార్క్ దేశ రాణి దేశ ప్రజలకు న్యూఇయర్ వేడుకల్లో మునిగితేలుతున్న ప్రజలకు దిమ్మ తిరిగే షాకిచ్చారు. యూరోపియన్ దేశంగా సుపరిచితమైన సంపన్న దేశాల్లో ఒకటైన డెన్మార్క్ కు రాణిగా వ్యవహరిస్తున్న మార్గరెట్ 2 తాను సింహాసనం నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

అదే సమయంలో తన వారసుడ్ని ఆమె ప్రకటించారు. తన పెద్ద కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ రాజుగా పగ్గాలు చేపడతారని పేర్కొన్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆమె ప్రసంగాన్ని లైవ్ లో దాదాపు 60 లక్షలకు పైగా ప్రజలు వీక్షిస్తుండగా ఆమె ఈ సంచలన ప్రకటన చేశారు. 2023 ఫిబ్రవరిలో రాణికి సర్జరీ జరిగింది.

తన వెన్నెముకకు జరిగిన సర్జరీ తనను భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేసిందన్న ఆమె.. ‘‘తర్వాతి తరానికి బాధ్యతలు అప్పగించే సమయం ఆసన్నమైనందని ఆర్థమైంది. పదవీ విరమణ చేయటానికి ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నా. నా తండ్రి తర్వాత బాధ్యతలు తీసుకున్న నేను.. 2024 జనవరి 14తో రాణిగా 52 ఏళ్లు పూర్తి చేసుకోనున్నా. అదే రోజు రాణిగా సింహాసాన్ని వీడనున్నా. ఆ రోజే నా కుమారుడు రాజు కిరీటాన్ని ధరించనున్నారు’’ అంటూ ఆమె సర్ ప్రైజ్ కు గురి చేశారు.

రాణి సేవలపై దేశ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్ ధన్యవాదాలు తెలిపారు. ఐరోపాలోని పలు దేశాల్లో ఇప్పటికి రాజరికం కంటిన్యూ అవుతోంది. అయితే.. ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నప్పటికీ రాజ కుటుంబాలకు పరిమిత మోతాదులో వారికి ప్రత్యేక స్థానాన్ని ఇవ్వటం తెలిసిందే. ఐరోపాలో దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 తర్వాత 83 ఏళ్ల మార్గరెట్ 2 ఐరోపాలో అత్యధిక కాలం సింహాసనాన్ని అధిష్ఠించిన రాణిగా పేరుప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. ఆమె అనంతరం రాజుగా పట్టాభిషిక్తులు కానున్న క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడెరిక్ కు 55 ఏళ్లు.

ఈ పట్టాభిషేక కార్యక్రమం బ్రిటిష్ రాజరిక సంప్రదాయాలకు తగ్గట్లు జరగదు. ఇక్కడ కాస్త భిన్నంగా జరుగుతుంది. కోపెన్ హెగన్ లో ఉన్న డానిష్ రాజ కుటుంబ నివాసం (అమోలియన్ బోర్గ్) నుంచి పట్టాభిషేకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది. జనవరి 14న రాణి స్థానంలో డెన్మార్క్ రాజుగా.. గ్రీన్ ల్యాండ్ ఫారోయి దీవులకు దేశాధినేతగా ఉంటారు. డెన్మార్క్ అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ.. రాజు లేదంటే రాణి మాత్రం సామ్రాజ్యధినేతగా వ్యవహరిస్తుంటారు. వారికి పరిమిత మోతాదులోనే అధికారాలు ఉంటాయి.