Begin typing your search above and press return to search.

చ‌ట్టం పేద‌ల ప‌క్ష‌మే.. సాయిబాబా కేసులో స్టే విధించ‌లేం: సుప్రీంకోర్టు

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది

By:  Tupaki Desk   |   11 March 2024 3:11 PM GMT
చ‌ట్టం పేద‌ల ప‌క్ష‌మే.. సాయిబాబా కేసులో స్టే విధించ‌లేం:  సుప్రీంకోర్టు
X

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలున్నాయన్న అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందంటూ ఇటీవల బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, హైకోర్టు తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్పై సోమవారం ప్రాథమికంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీర్పును సమర్థించింది. అన్ని కోణాల్లోనూ పరిశీలించే హైకోర్టు తీర్పు చెప్పిందని పేర్కొంది. అంతేకాదు, "చట్టం ఎప్పుడూ అమాయకుల పక్షానే ఉంటుంది. నిర్దోషిగా విడుదల ఆదేశాలు పొందాక.. వారి అమాయకత్వం మరింత బలపడుతుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో సదరు తీర్పుపై స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని మౌఖికంగా తేల్చి చెప్పింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై విచారణ చేస్తామని, నిర్ణీత సమయంలో దీనిని పరిశీలిస్తామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడి ధర్మాసనం వెల్లడించింది. ఈ నెల 5న బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మహారాష్ట్ర వేసిన పిటిషన్ ను సాధ్యమైనంత త్వరగా లిస్టింగ్ చేయాలన్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పి రాజు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంలో ఎలాంటి తొందరపాటు ఉండకూడదని. ఒకవేళ అది వేరే విధంగా ఉండి ఉంటే అలోచించేవాళ్లమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

హైకోర్టు అన్ని కోణాల్లోనూ పరిశీలించి సహేతుకమైన ఆదేశాలు ఇచ్చింది. పైగా, తన(సాయిబాబా) నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఎంతో కష్టపడిన కేసు. ఆయన ఎన్నో సంవత్సరాలు జైల్లో గడిపారు. సాధారణం గా ఇలాంటి అప్పీల్ను కొట్టివేసి ఉండాల్సింది. కానీ, ఈ కేసులో గతంలోనే జోక్యం చేసుకున్నందున దానిని గౌరవిస్తున్నాం. అందుకే అప్పీల్ను విచారణకు స్వీకరిస్తున్నాం. ఇలా కనుక జరిగి ఉండకపోతే, ఈ కేసులో జోక్యం చేసుకునే అవకాశం ఉండేది కాదు. హైకోర్టు సహేతుకమైన ఆదేశాలే ఇచ్చింది" అని జస్టిస్ గవాయ్ అన్నారు.

హైకోర్టు ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసిందని, తొలి కేసులో మాత్రమే సుప్రీంకోర్టు జోక్యం ఉంటుందని తెలిపారు. ఈ సం దర్భంగా రాజు స్పందిస్తూ ఈ కేసులో కౌన్ని పత్రాలు దాఖలు చేయాల్సి ఉందని, ముఖ్యంగా ఉగ్రవాద నిరోధక చట్టం(ఉపా) కింద సాయిబాబాను విచారిం చేందుకు అనుమతి పొందిన పత్రాలను సమర్పించాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని, "చట్టం ఎప్పుడూ అమాయకుల పక్షానే ఉంటుంది. నిర్దోషిగా విడుదల ఆదేశాలు పొందాక.. వారి అమాయకత్వం మరింత బలపడుతుంది" అని వ్యాఖ్యానించింది.