Begin typing your search above and press return to search.

మద్యం కుంభకోణం విలువ రూ. 600 కోట్ల పైమాటే?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ అరెస్టయ్యారు

By:  Tupaki Desk   |   23 March 2024 1:30 AM GMT
మద్యం కుంభకోణం విలువ రూ. 600 కోట్ల పైమాటే?
X

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అంతకు ముందే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పిసోడియా సైతం జైలులోనే ఉండటం గమనార్హం. దీంతో కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. రూ. వందలాది కోట్లు చేతులు మారాయని తెలుస్తోంది. ఈ మేరకు ఈడీ తరఫు న్యాయవాది ఎస్పీ రాజు కోర్టుకు విన్నవించడం జరిగింది. అక్రమాల డొండ తీగ లాగితే కదులుతోంది.

కిక్ బ్యాక్ లకు బదులుగా సౌత్ గ్రూప్ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. ఇందులో రూ. 100 కోట్లు లంచం మాత్రమే కాదు ఇంకా అధిక మొత్తంలో నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వచ్చే లాభాల కోసం కోట్లాది రూపాయలు బడా బాబుల హస్తాల్లో పడినట్లు చెబుతున్నారు. దీంతో కేసు పలు మార్గాల్లో తిరుగుతోంది.

అన్ని దారుల్లో అక్రమాల సొమ్ము రూ. 600 కోట్ల పైమాటే అంటున్నారు. రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు బదిలీ అయినట్లు సమాచారం. దీంతో కేసు కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కేసు పూర్వాపరాలు తెలిసే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ఇంకా కొందరి హస్తం ఉందేమోననే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ అరెస్టు తో కేసులో పురోగతి సాధించినట్లు చెబుతున్నారు. వారి పాత్ర తేలితే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేసు అంత త్వరగా వెళ్లడవుతుందా? అనేది అనుమానమే. కేసులో కవిత కూడా కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో లిక్కర్ కుంభకోణం నేతల మెడకు చుట్టుకోవడం ఖాయమే అంటున్నారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీల రంగులు బయట పడటంతో వారి రాజకీయ భవితవ్యం గందరగోళంలో పడే వీలుంది. మాది మచ్చలేని పాలన అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన పార్టీల బాగోతం బయటకు రావడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇందులో ఇంకా ఏం రహస్యాలు బయటపడతాయో వేచి చూడాల్సిందే మరి.