Begin typing your search above and press return to search.

వరద నీటిలో రిపోర్టింగ్... నెటిజన్ల కామెంట్స్ వైరల్!

ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది జర్నలిస్ట్ రిపోర్టింగ్

By:  Tupaki Desk   |   15 July 2023 9:39 AM GMT
వరద నీటిలో రిపోర్టింగ్... నెటిజన్ల కామెంట్స్ వైరల్!
X

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్థంభించిన సంగతి తెలిసిందే. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా... ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తోందని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక టీవీ ఛానల్ యాంకర్... ట్యూబ్ సహాయంతో వరదనీటిలోకి దిగి రిపోర్టింగ్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

అవును... ఢిల్లీలో వరదల నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ మెడలోతు నీటిలో రిపోర్టింగ్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌ లో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆమె తన రిపోర్టింగ్ కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్. స్క్వాడ్‌ కు అందించిన పరికరాలను ఉపయోగించడాన్ని ఈ వీడియోలు చూడవచ్చు. దీంతో... ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని తెలుస్తుంది.

తాజాగా ఒక వ్యక్తి ట్విట్టర్‌ లో పోస్ట్ చేసిన వీడియోలో ఒక మహిళా జర్నలిస్ట్ నీటిలో మునిగిపోకుండా తన శరీరం చుట్టూ సేఫ్టీ ట్యూబ్‌ ని ధరించి వరద నీటిలో ఉండి రిపోర్టింగ్ చేస్తున్నట్లు ఉంది. ఈ సమయంలో కొంతమంది ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది రెస్క్యూ బోట్‌ లో ఆమెకు దగ్గరగా కనిపిస్తారు! వారిలో ఒకరు ఈ సీన్ మొత్తాన్ని వీడియో తీస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఇదే సమయంలో మరొక ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది జర్నలిస్ట్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కెమెరాకు పోజులిస్తుండగా ఆమె ఫోటోలు తీయడం చూడవచ్చు. అయితే ఈ చర్యపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక నెటిజన్.. తన ట్విట్టర్‌ లో వీడియో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు… తీవ్రస్థాయిలో ఫైరవుతూ విమర్శలు చేస్తున్నారు!

ఈ సందర్భంగా... "ఇది ఎలాంటి వార్తా రిపోర్టింగ్? ఆమె ఎన్.డి.ఆర్.ఎఫ్. వాలంటీర్‌ ని కేవలం రిపోర్టింగ్ కోసం, తన ఫోటోల కోసం వాడుకుంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వద్ద ఉన్న పరిమిత పడవలు కూడా వార్తా నివేదికల కోసం ఉపయోగించబడుతున్నాయి. క్షమించండి మాకు ఇలాంటి వార్తలు వద్దు"! అని కామెంట్ పోస్ట్ చేశాడు.

ఇలా వీడియో వైరల్ అవ్వడంతో... వ్యక్తిగత ఉపయోగం కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్. పరికరాలను ఉపయోగించినందుకు రిపోర్టర్‌ ను నెటిజన్లు విపరీతంగా నిందిస్తున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా కొంతమంది నెటిజన్లు... ఆ న్యూస్ ఛానల్ ను కూడా విమర్శిస్తున్నారని తెలుస్తుంది.

ఈ సందర్భంగా... "ప్రభుత్వం ఈ జోకర్లను నిషేధించాలి" అని రిపోర్టర్ చేసిన పనిని విమర్శిస్తూ ఒకరు కామెంట్ పెట్టగా... "వారు తమ పనిని సరిగ్గా చేసి, ఢిల్లీలో ఏ రహదారి మూసివేయబడింది, ఎక్కడ తెరిచి ఉందో ప్రజలకు చెప్పాలి" అని మరొక నెటిజన్ సూచించారు.

ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క దేశ రాజధానిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా యమునా నది నీటి మట్టం పెరగడంతోపాటు.. పొరుగున ఉన్న హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుండి నీటిని విడుదల చేయడంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని తెలుస్తుంది.