ఆన్ లైన్ లో భార్యతో సె*క్స్ ఆఫర్.. బెయిల్ కు నో చెప్పిన కోర్టు!
అందుకు నో చెబితే శారీరకంగా హింసించేవాడు. బ్లేడ్ తో గాయపర్చేవాడు. ఇలా అడ్డమైన దుర్మార్గాలు చేసే భర్త చేష్టల నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By: Tupaki Desk | 18 Jun 2025 9:44 AM ISTకొన్ని ఉదంతాల గురించి విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. అసలు ఇలాంటి ఛండాలమైన మనుషులు ఉంటారా? అన్న భావన కలుగుతుంది.కానీ.. కొందరు దుర్మార్గులు ఎంతటి కిరాతకంగా వ్యవహరిస్తారన్న దానికి నిదర్శనంగా కొన్ని ఉదంతాలు వెలుగు చూస్తుంటాయి.తాజాగా చెప్పేది కూడా అలాంటి కోవకు చెందిందే. మరిది తనను లైంగికంగా వేధిస్తున్నాడని భర్తకు చెబితే పట్టించుకునే వాడు కాదు. నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో పాటు తాను చెప్పినట్లు తన స్నేహితులతో సెక్సు చేయాలని హోటల్ కు తీసుకెళ్లేవాడు.
అందుకు నో చెబితే శారీరకంగా హింసించేవాడు. బ్లేడ్ తో గాయపర్చేవాడు. ఇలా అడ్డమైన దుర్మార్గాలు చేసే భర్త చేష్టల నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. భార్య ఫోటోలతో నకిలీ ఇన్ స్టా ఐడీల్ని క్రియేట్ చేసి.. డబ్బులిచ్చి ఎవరైనా సెక్సులో పాల్గొనవచ్చంటూ ఆన్ లైన్ లో ఆఫర్ చేసేవాడు. ఈ వివరాల్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తనకు బెయిల్ ఇవ్వాలంటూ సదరు భర్త ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. భార్యను దారుణంగా చిత్రహింసలు పెట్టి.. ఇతరులతో శృంగారం చేయాలంటూ బలవంతం పెట్టిన భర్తకు బెయిల్ ఇచ్చేందుకు ససేమిరా అంది ఢిల్లీ హైకోర్టు. క్రూరమైన ప్రవర్తన.. విశ్వాసాన్ని భంగపర్చటం.. లాంటి అభియోగాలు ఎఫ్ఐఆర్ లో ఉన్న నేపథ్యంలో.. ఇది సాధారణ వైవాహిక వేధింపుల కేసు కాదన్న ఢిల్లీ హైకోర్టు.. భర్తను బెయిల్ ఇచ్చేందుకు ససేమిరా అని తేల్చేసింది.
