Begin typing your search above and press return to search.

ఢిల్లీ కార్ల యజమానుల కొంప ముంచిన బీజేపీ సర్కార్

ప్రభుత్వానికి మించిన పవర్ ఫుల్ వ్యవస్థ మరేం ఉంటుందని అనుకుంటాం కానీ.. వారి భవిష్యత్తును డిసైడ్ చేసే ప్రజలే అత్యంత శక్తివంతులన్న విషయాన్ని తరచూ మర్చిపోతుంటారు

By:  Tupaki Desk   |   5 July 2025 1:00 PM IST
ఢిల్లీ కార్ల యజమానుల కొంప ముంచిన బీజేపీ సర్కార్
X

ప్రభుత్వానికి మించిన పవర్ ఫుల్ వ్యవస్థ మరేం ఉంటుందని అనుకుంటాం కానీ.. వారి భవిష్యత్తును డిసైడ్ చేసే ప్రజలే అత్యంత శక్తివంతులన్న విషయాన్ని తరచూ మర్చిపోతుంటారు. ఆసక్తికర విషయం ఏమంటే.. ఈ విషయాన్ని ప్రజలే కాదు.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సైతం మర్చిపోతుంటాయి. ఆ క్రమంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు.. ప్రజల్లో ఆగ్రహావేశాల్ని రగల్చి.. ప్రభుత్వానికి ముచ్చమటలు పుట్టిస్తుంటారు. అలాంటి ఉదంతమే ఒకటి ఢిల్లీ స్టేట్ లో చోటు చేసుకుంది. కాకుంటే.. ఈ మధ్యలో ఆ రాష్ట్రంలోని ఢిల్లీ మహానగర కార్ల యజమానులు కొందరికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. దీంతో.. వారు ఢిల్లీలోని బీజేపీ సర్కారు మీద అగ్గి ఫైర్ అవుతున్నారు.

ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తామన్న కొత్త వాహన పాలసీపై ఢిల్లీ బీజేపీ సర్కారు వెనక్కి తగ్గటం తెలిసిందే. ముందుగా అనుకున్న దాని ప్రకారం పదేళ్లు పైబడిన డీజిల్.. పదిహేనేళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో డీజిల్.. పెట్రోల్ పోసేది లేదని ప్రకటించటం తెలిసిందే. దీంతో.. సర్కారు నిర్ణయంతో తమ కార్లను అమ్మటం మొదలు పెట్టారు.

ప్రభుత్వం పక్కాగా తన నిర్ణయాన్ని అమలు చేస్తుందన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్ల యజమానులు తమ కార్లను తక్కువ ధరకే అమ్మేసుకున్నారు. ఢిల్లీ సర్కారు నిర్ణయంతో సరిహద్దు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద ఎత్తున కార్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. అయితే.. బీజేపీ సర్కారు తీరుపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.తమ ఆగ్రహానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.

దీంతో. బీజేపీ సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. జులై ఒకటి నుంచి పక్కాగా అమలు చేస్తామన్న నిబంధనకు తాత్కాలికంగా స్వస్తి పలికింది. దీంతో.. కార్ల యజమానులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తొందరపాటుతో వాహనాల్ని అమ్మేసుకున్న వారంతా లబోదిబో అంటున్నారు. ఢిల్లీకి చెందిన నితిన్ గోయల్ అనే వ్యక్తి తన రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను కేవలం రూ.8 లక్షలమే అమ్మేశారు. ఇదే విధంగా మరో యజమాని రూ.55 లక్షల లగ్జరీ కారును నామమాత్రపు ధరకు అమ్మేశారు. బాధ్యతతో.. ముందు జాగ్రత్తతో కార్లను అమ్మేసినోళ్లంరికి భారీగా నష్టపోయారు. వీరంతా ఢిల్లీలోని బీజేపీ రాష్ట్ర సర్కారుపై కారాలు.. మిరియాలు నూరుతున్నారు.